రాజమౌళి రాక్షసత్వం ఇలా ఉంటుందా?
తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సినిమా ఆర్ఆర్ఆర్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సినిమా ఆర్ఆర్ఆర్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తోపాటు ఆలియా భట్, ఓలివియా మోరిస్, సముద్రఖని తదితరులు నటించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించారు.
2022 మార్చిలో విడుదలైన ఆర్ఆర్ఆర్.. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా ఎన్నో ఘనతలు సాధించింది. మరెన్నో అవార్డులు అందుకుంది. ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు గాను ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. అనేక మంది సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంది.
రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ టీమ్.. ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ : బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ 20వ తేదీన పలు థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని, నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుబాటులో ఉంటుందని చెప్పింది. ఈ క్రమంలో నిన్న ట్రైలర్ ను విడుదల చేసింది.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీ కోసం రాజమౌళి అండ్ టీమ్ ఎలా కష్టపడింది? ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది? తెర వెనుక ఏం జరిగింది? యాక్షన్ సీన్స్ కోసం ఎంతలా కష్టపడాల్సి వచ్చింది? వంటి పలు విషయాలను డాక్యుమెంటరీలో చెప్పనున్నారు మేకర్స్. ఇప్పుడు అందుకు సంబంధించిన శాంపిల్ ను ట్రైలర్ రూపంలో రిలీజ్ చేశారు.
సినిమా కోసం జక్కన్న, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఎలా కష్టపడ్డారో.. ఎంతలా శ్రమించారో ట్రైలర్ లో చూపించారు. అలాగే వర్క్ లో రాజమౌళి రాక్షసత్వం ఇలా ఉంటుందా అనేలా కామెంట్స్ వస్తున్నాయి. ఆస్కార్ రేసు వరకు తీసుకెళ్లేందుకు ఎంత కష్టపడ్డారో చిన్నగా రివీల్ చేశారు. సెట్స్ లోని ఫన్నీ సీన్స్ కూడా యాడ్ చేశారు. అదే సమయంలో ఆర్ఆర్ఆర్ క్యాస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ ను మేకర్స్ రివీల్ చేశారు.
తాను ఆర్ఆర్ఆర్ కన్నా ముందు చేసిన సినిమాలకు ఎప్పుడూ భయపడలేదని వీడియోలో రాజమౌళి తెలిపారు. RRRలో ఒకటి కాదు రెండు పులులతో పనిచేశానని చెప్పారు. తారక్ ను అంతా యంగ్ టైగర్ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. ఓ సందర్భంలో తన బెస్ట్ ఫ్రెండ్ తారక్ ను చూసి తాను అసూయ పడినట్లు రామ్ చరణ్ చెప్పారు.
ఆస్కార్ రావడమనేది.. తన కెరీర్ లో బెస్ట్ మూమెంట్ రామ్ చరణ్ అని అన్నారు. తన లైఫ్ లో ఎప్పుడూ మర్చిపోలేనని ఎన్టీఆర్ తెలిపారు. ఆ తర్వాత ఆలియా భట్, కార్తికేయ, కీరవాణి, అజయ్ దేవగన్ సహా మూవీ టెక్నీషియన్స్ అంతా మూవీ కోసం మాట్లాడారు. సినిమా విషయంలో తమ ఎక్స్పీపీరియన్స్ ను షేర్ చేశారు.
ప్రస్తుతం డాక్యుమెంటరీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా, ఎక్సైటింగ్ గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఆకట్టుకుంటుందని కామెంట్లు పెడుతున్నారు. వెయిటింగ్ ఫర్ డాక్యుమెంటరీ అని అంటున్నారు. మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ ఎలా ఉంటుందో చూడాలి.