'సప్తసాగరాలు' పాప.. ఎంత క్యూట్ గా ఉందొ..

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో రుక్మిణి వసంత్ సోఫా చైర్ లో కూర్చొని ప్యాంటు, టాప్ తో ఉన్న ఒక ఫోటోలు షేర్ చేసింది.

Update: 2024-10-20 06:56 GMT

‘సప్తసాగరాలు దాటి’ మూవీతో హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ రుక్మిణి వసంత్. ఈ కన్నడ భామకి ‘బీర్బల్’ అనే సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. తరువాత హిందీలో ‘అప్ స్టైర్స్’ అనే మూవీలో నటించింది. అయితే రక్షిత్ శెట్టికి జోడీగా చేసిన ‘సప్తసాగరాలు దాటి సిరీస్’ మాత్రం ఆమెకి స్టార్ హీరోయిన్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగిచూసుకునే అవకాశం లేకుండా వరుస ఛాన్స్ లు అందుకుంటుంది.

 

కన్నడంలో శ్రీమురళీకి జోడీగా ‘భఘీర సినిమాలో రుక్మిణి వసంత్ నటించింది. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. మరో వైపు తెలుగులో నిఖిల్ కి జోడీగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే చిత్రంలో నటిస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక కన్నడంలో శివరాజ్ కుమార్ తో ‘భారతీ రంగల్’ చిత్రంలో చేస్తోంది. వీటితో పాటు తమిళంలో విజయ్ సేతుపతికి జోడీగా ‘ఏస్’ అనే మూవీలో నటిస్తోంది.

 

అలాగే శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో కూడా హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది. ఇలా ప్రస్తుతం రుక్మిణి వసంత్ చేతిలో అరడజను సినిమాల వరకు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె ప్రాజెక్ట్ కోసం సైన్ చేసిందని టాక్ నడుస్తోంది.

 

ఇలా చేతినిండా ప్రాజెక్ట్స్ తో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ దిశగా దూసుకుపోతోంది. తెలుగులో కూడా చాలా ప్రాజెక్ట్స్ కోసం ఈమె పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో రుక్మిణి చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన మూవీ అప్డేట్స్ తో గ్లామర్ ఫోటోలని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలకి ఆమె ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు నుంచి అదిరిపోయే రేంజ్ లో కామెంట్స్ వస్తాయి.

 

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో రుక్మిణి వసంత్ సోఫా చైర్ లో కూర్చొని ప్యాంటు, టాప్ తో ఉన్న ఒక ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలో రుక్మిణి చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News