పిక్‌ టాక్‌ : బ్లాక్‌లో మెరిసిన ఎన్టీఆర్‌-నీల్‌ హీరోయిన్‌

ఆకట్టుకునే అందంతో పాటు బ్లాక్‌ ఔట్ ఫిట్‌లో ఈమె అందానికి ఫిదా అవుతున్నారు. బ్లాక్ డ్రెస్‌ ఈమెకి బాగా సెట్‌ అయ్యింది.

Update: 2025-01-18 04:40 GMT

'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాలో నిఖిల్‌కు జోడీగా నటించిన ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్‌. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఈ అమ్మడికి పెద్ద సినిమాలు ఏమీ పడలేదు. కానీ కన్నడంలో మాత్రం ఈ అమ్మడు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఈ అమ్మడు చేసిన సప్త సాగరాలు దాటి సినిమా రెండు పార్ట్‌లకు మంచి స్పందన దక్కింది. ఆ సినిమా రెండు భాగాలను తెలుగు ప్రేక్షకులు చూసి ఆదరించారు. అందుకే తెలుగులో ఈ అమ్మడు డైరెక్ట్‌ సినిమా మళ్లీ ఎప్పుడు చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు తెలుగులో ఈ అమ్మడు ఎన్టీఆర్‌కి జోడీగా నటించబోతుంది.

 

సప్త సాగరాలు దాటి సినిమాలో నటనతో మెప్పించిన ఈ అమ్మడు అందంతోనూ ఆకట్టుకుంటూ ఉంది. సింపుల్‌ అండ్‌ స్వీట్‌ లుక్‌లోనే కాకుండా స్కిన్‌ షోతోనూ ఈ అమ్మడు ఆకట్టుకుంది. పలు సార్లు సోషల్ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసిన ఈ అమ్మడు ఈసారి సింపుల్‌ అండ్ స్వీట్‌ అనిపించే విధంగా బ్లాక్ ఔట్‌ ఫిట్‌లో సందడి చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు బ్లాక్‌ ఔట్ ఫిట్‌లో ఈమె అందానికి ఫిదా అవుతున్నారు. బ్లాక్ డ్రెస్‌ ఈమెకి బాగా సెట్‌ అయ్యింది. గతంలో షేర్‌ చేసిన ఫోటోలతో పోల్చితే ఈ ఫోటోలు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయంటున్నారు.

 

ఎన్టీఆర్‌తో ఈమె నటించబోతుంది అంటూ నందమూరి ఫ్యాన్స్‌ ఈ పోటోలను తెగ షేర్‌ చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఇటీవలే ఎన్టీఆర్‌తో సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ప్రారంభించాడని, ఈ నెల చివరి వారంలో ఎన్టీఆర్‌ సైతం షూటింగ్‌లో జాయిన్‌ కాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అంతే కాకుండా ఎన్టీఆర్‌ కి జోడీగా రుక్మిణి వసంత్‌ నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తల విషయంలో ఇప్పటి వరకు అటు నుంచి కానీ, ఇటు నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. త్వరలోనే ఆ విషయమై అధికారికంగా ప్రకటన వస్తుందేమో చూడాలి.

రుక్మిణి ఆర్మీ స్కూల్‌లో చదువుకుంది. ఎయిర్‌ ఫోర్స్‌లో ట్రైనింగ్‌ చేసింది. లండన్‌లోని బ్లూమ్స్‌బరీలోని రాయల్‌ అకాడమీలో నటనలో పట్టా పొందింది. యాక్టింగ్‌ విషయంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న రుక్మిణి వసంత్‌ కచ్చితంగా ఎన్టీఆర్‌కి జోడీగా నటించడం ద్వారా సినిమాకు ఆర్షణగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఎన్టీఆర్‌తో కలిసి ఈ అమ్మడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌తో సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఈ అమ్మడు బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News