RC 16 నుంచి రెహమాన్ ఔట్!?
అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి రెహన్ ఎగ్జిట్ అయినట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
యంగ్ మేకర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న 'ఆర్సీ 16' కి ఏ.ఆర్ రెహమాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వడం...రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. తదుపరి షెడ్యూల్ కి బుచ్చిబాబు రంగం సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా బుచ్చిబాబు ఏరికోరి మరీ రెహమాన్ రంగంలోకి దించారు. రెహమాన్ మాత్రమే తన విజన్ ని అందుకుని తనకు కావాల్సిన విధంగా సంగీతం అందిస్తారని భావించి పట్టుబట్టి మరీ సీన్ లోకి తెచ్చారు.
ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే రెహమాన్ మంచి ట్యూన్స్ ఇచ్చారని బుచ్చిబాబు అన్నారు. అందుకు తగ్గట్టు సినిమా ప్రారంభోత్సవంలో రెహమాన్ కూడా పాల్గొన్నారు. సాధారణంగా సినిమా లాంచింగ్ లకు రెహమాన్ హాజరవ్వరు. కానీ రామ్ చరణ్-బుచ్చిబాబు కోసం రెహమాన్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. ఆ సినిమాకి సంబంధించిన సంగీతం పనుల్లోనూ రెహమాన్ బిజీ అయినట్లు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి రెహన్ ఎగ్జిట్ అయినట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. కారణాలు ఏంటి? అన్నది తెలియదు గానీ వ్యక్తిగత కారణాలతో రెహమాన్ ఆర్సీ 16 ప్రాజెక్ట్ వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రెహమాన్ స్థానంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ వచ్చినట్లు వినిపిస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి. రెహమాన్ ట్యూన్స్ ఆన్ టైమ్ కి ఇవ్వరు? అనే ఆరోపణ ఉంది.
ఆయనతో సంగీతం అంటే? తలప్రాణం తొకకి వస్తుందని ఓ సందర్భంలో రాంగోల్ వర్మ కూడా అన్నారు. రెహమాన్ మాటలకు..చేతలకు సంబంధం లేకుండా ఉంటుందని..ఆ కారణంగా సినిమాలు డిలే అవుతాయని వర్మ అన్నారు. ఇంకా ఇండస్ట్రీలో రెహమాన్ బాధితులు చాలా మంది ఉన్నారు. మరి రెహమాన్ తాజా ఎగ్జిట్ గనుక నిజమైతే కారణాల్లో ఇది కూడా ఒకటా? అన్నది తెలియాలి.