వీర‌మ‌ల్లు ఏదోటి తేల్చేస్తే బెట‌ర్!

చూస్తుండ‌గానే ఫిబ్ర‌వరి నెల కూడా పూర్తైపోయింది. రేప‌టి నుంచి మార్చిలోకి వెళ్తున్నాం. అంటే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు రిలీజ్ కు మ‌రో 28 రోజులు మాత్ర‌మే టైముంది.;

Update: 2025-02-28 07:50 GMT

చూస్తుండ‌గానే ఫిబ్ర‌వరి నెల కూడా పూర్తైపోయింది. రేప‌టి నుంచి మార్చిలోకి వెళ్తున్నాం. అంటే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు రిలీజ్ కు మ‌రో 28 రోజులు మాత్ర‌మే టైముంది. వీర‌మ‌ల్లును ఎలాగైనా ఈ డేట్ కే తీసుకొస్తామ‌ని చెప్పిన త‌ర్వాత ద‌ర్శ‌కనిర్మాత‌లు నుంచి మ‌రో అప్డేట్ వ‌చ్చింది లేదు. కానీ వీర‌మ‌ల్లు కు ఇంకా కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ప‌వ‌న్ నాలుగైదు డేట్స్ అడ్జస్ట్ చేస్తే షూటింగ్ అయిపోతుందంటున్నారు కానీ ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం, రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా అది కుదిరేలా క‌నిపించ‌డం లేదు కాబ‌ట్టి వీర‌మ‌ల్లు వాయిదా త‌ప్పేలా లేదు. ప‌వ‌న్ రాడ‌నే ఉద్దేశంతోనే మార్చి 28న రాబిన్‌హుడ్, 29న మ్యాడ్ స్క్వేర్ సినిమాలు వ‌స్తున్నాయి. వీర‌మ‌ల్లు పోస్ట్ పోన్ ఖాయ‌మ‌ని డిసైడ‌య్యే త‌మ సినిమాల‌కు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ ను స్పీడ‌ప్ చేయ‌నున్నాయి ఆ రెండు సినిమాలు.

వీర‌మ‌ల్లు మార్చి 28 నుంచి వాయిదా ప‌డితే ఏప్రిల్ 11 లేదా ఏప్రిల్ 18లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ చూస్తున్నార‌ట‌. కానీ అనుష్క ఘాటీ ఏప్రిల్ 18న రిలీజ్ కానున్న‌ట్టు ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. ఘాటీ పోస్ట్ పోన్ అయితే వీర‌మ‌ల్లుకు ఆ డేట్స్ అనుకూలంగానే ఉంటాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఘాటీ వాయిదా గురించి ఎలాంటి వార్త‌లు రాలేదు. చెప్పిన టైమ్ కే సినిమాను రిలీజ్ చేయాల‌ని ఘాటీ టీమ్ భావిస్తోంది.

ఒక‌వేళ ఏప్రిల్ 11నే రావాల‌నుకుంటే మార్చి 27కు దానికి మ‌ధ్య ఉన్న‌ది రెండు వారాల గ్యాపే. ఈ రెండు వారాల్లో వీర‌మ‌ల్లును పూర్తి చేయ‌గ‌లరా అనేది మ‌రో డౌట్. దానికి తోడు ఇప్ప‌టివ‌ర‌కు వీర‌మ‌ల్లు నుంచి వ‌చ్చిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ ఏదీ ఆడియ‌న్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకోలేదు. కాబ‌ట్టి వీర‌మ‌ల్లు నిర్మాత ఈ విష‌యంలో ఏదొక క్లారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

ఇవ‌న్నీ కాదు చెప్పిన ప్ర‌కారం మార్చిలోనే సినిమాను రిలీజ్ చేస్తామంటే ఇప్ప‌టికిప్పుడే ప్ర‌మోష‌న్స్ వేగాన్ని పెంచాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. పవ‌న్ క‌ళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉన్నా రూర‌ల్ ఆడియ‌న్స్ థియేటర్ల‌కు రావాలంటే ప్ర‌మోష‌న్స్ కీల‌కం. కాబ‌ట్టి ప్ర‌మోషన్స్ బాగా జ‌రగాలి. అప్పుడే సినిమా ఆడియ‌న్స్ కు రీచ్ అవుతుంది. ఏదైనా వీర‌మ‌ల్లు రిలీజ్ డేట్ విషయంలో నిర్మాత‌లు ఓ క్లారిటీ ఇస్తే అంద‌రికీ బావుంటుంది. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో బాబీ డియోల్ కీల‌క పాత్ర‌లో నటిస్తున్నాడు.

Tags:    

Similar News