సుక్కు.. మహేష్.. సంథింగ్ సంథింగ్..!

లేటెస్ట్ గా సుకుమార్ కూతురు సుకృతి నటించిన గాంధీ తాత చెట్టు సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేశారు.

Update: 2025-01-10 05:42 GMT

పదేళ్ల క్రితం సంక్రాంతికి ముందుగానే వచ్చిన సినిమా 1 నేనొక్కడినే సూపర్ స్టార్ మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ఐతే తెలుగు రాష్ట్రాల్లో ఆడని ఆ సినిమా యూఎస్ లో మాత్రం హిట్ చేశారు. ఆ తర్వాత సుకుమార్ మహేష్ తో మరో సినిమా చేయాలని అనుకున్నారు. పుష్ప సినిమా ప్లేస్ లో సుకుమార్ మహేష్ సినిమా పడాల్సింది కానీ అది సెట్ అవ్వలేదు. మహేష్ తో డిస్కషన్ ఉన్నా సరే మధ్యలోనే వచ్చి అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేశాడు సుకుమార్.

ఆ టైం లోనే మహేష్ కూడా సుకుమార్ తో సినిమా ఆగిపోయిందని ట్విట్టర్ లో చెప్పాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కాస్త దూరం ఉంది అన్న టాక్ నడిచింది. ఐతే పుష్ప 1 ఆ తర్వాత ఈమధ్యనే వచ్చిన పుష్ప 2 తో సుకుమార్ పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ఈ గ్యాప్ లో మహేష్ సుకుమార్ మధ్య ఉన్న దూరం కూడా పోయింది. ఇప్పుడు మహేష్ సుకుమార్ రెగ్యులర్ టచ్ లో ఉన్నారు. లేటెస్ట్ గా సుకుమార్ కూతురు సుకృతి నటించిన గాంధీ తాత చెట్టు సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ రిలీజ్ చేయడమే కాదు ఇంప్రెసివ్ గా ఉందని అన్నారు. దీనికి సూపర్ స్టార్ మహేష్ కు సుకుమార్ కూడా థాంక్స్ చెప్పాడు. పదేళ్ల క్రితం సినిమా తీసి ఆ తర్వాత ఎప్పుడు పెద్దగా మాట్లాడుకున్నట్టు కూడా అనిపించని సుకుమార్, మహేష్ ఇలా రెగ్యులర్ టచ్ లో ఉండటం ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఎలాగు పుష్ప 2 తో నేషనల్ వైడ్ గా సుకుమార్ స్టామినా ఏంటో ప్రూవ్ అయ్యింది. సో రాజమౌళి తర్వాత మహేష్ మరోసారి సుకుమార్ తో పనిచేసే ఛాన్స్ కూడా ఉంది.

మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. 3 ఏళ్లు తన టైం ని ఇచ్చిన మహేష్ రాజమౌళి సినిమా మీద పూర్తి ఫోకస్ చేశాడు. ఈ సినిమా కోసం మహేష్ కొత్త లుక్ కూడా ట్రై చేస్తున్నాడు. రాజమౌళి సినిమా పూర్తి కాగానే సుక్కు సినిమా ప్లాన్ చేస్తే మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. సూపర్ స్టార్ మహేష్ సినిమాల ప్లానింగ్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక నుంచి అన్ని సినిమాలు పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అనేసేలా ఉన్నాడు సూపర్ స్టార్.

Tags:    

Similar News