దేవరకొండ తో జస్లీన్ సాహిబా.. సాంగ్ ఎలా ఉందంటే..
ఈ సారి టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
బాలీవుడ్ ప్రముఖ సింగర్, మ్యూజిక్ కంపోజర్ జస్లీన్ రాయల్ తన ప్రైవేట్ ఆల్బమ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాంగ్స్ కంపోజ్ చేయడంలో ప్రత్యేక శైలిని కలిగిన జస్లీన్, గతంలో ‘హీరియే’ అనే ప్రైవేట్ ఆల్బమ్‌లో దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు ఆమె మరో ప్రత్యేకమైన పాట ‘సాహిబా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
పీరియాడిక్ లవ్ స్టోరీ నేపథ్యంతో రూపొందిన ‘సాహిబా’లో విజయ్ దేవరకొండ ఫోటోగ్రాఫర్‌గా కనిపిస్తున్నాడు. ఫోటో తీయడానికి వెళ్లిన సందర్భంలో అతడు ఓ అమ్మాయితో ప్రేమలో పడిన కథాంశంతో ఈ సాంగ్ సాగుతుంది. ఈ పాటలో విజయ్ దేవరకొండకు జోడీగా రాధికా మదన్ నటించింది. ప్రోమో విడుదలైనప్పటి నుండే ఈ సాంగ్‌పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
‘సాహిబా’ సాంగ్ జస్లీన్ కంపోజ్ చేసిన సంగీతంతో పాటు అద్భుతమైన విజువల్స్‌తో అలరిస్తోంది. విజయ్ దేవరకొండ ప్రైవేట్ సాంగ్‌లో కనిపించడం ఫ్యాన్స్‌కి కొత్త అనుభూతిని అందించింది. ఇప్పటివరకు విజయ్ ఇలాంటి సాంగ్స్ చేయలేదు. ఇక సాహిబా సాంగ్ రొమాంటిక్ టచ్‌తో యూత్‌ను ఆకర్షించేలా ఉంది. ఈ పాటలో విజయ్ దేవరకొండ తన సహజ నటనతో, అభినయంతో అందరిని ఆకట్టుకుంటున్నాడు.
విడుదలైన వెంటనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రత్యేకంగా విజయ్ దేవరకొండ అభిమానులు ఈ పాటను భారీగా షేర్ చేస్తున్నారు. విజయ్, జస్లీన్ కాంబినేషన్లో ఈ పాట సంగీత ప్రేమికుల హృదయాలను దోచుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు. ముఖ్యంగా విజువల్స్ అద్బుతంగా ఉన్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్కయ్యేందుకు కూడా విజయ్ కు ఈ తరహా ప్రయోగం బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు.
ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గౌతమ్ తీన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోంది. ముఖ్యంగా విజయ్ ఈ సినిమాలో మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. మరోవైపు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో కూడా విజయ్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతోంది. ఇక లిస్టులో మరొక రెండు కథలు కూడా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. వాటిపై కూడా విజయ్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నాడు.