మెగా మేనల్లుడు 12 ఎకరాలే ఖబ్జా చేసాడా?
ఇందులో కీలకమైన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించారు. తాజాగా తదుపరి భారీ షెడ్యూల్ వేస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం ఏకంగా 12 ఏకరాల్లో ప్రత్యేకంగా సెట్ నిర్మిస్తున్నారుట.
మెగా మేనల్లుడు సాయిదుర్గ తేజ్ 'విరూపాక్ష' తర్వాత ఇంత వరకూ కొత్త సినిమా రిలీజ్ చేయలేదు. 'విరూపాక్ష' 100 కోట్ల విజయం అతడిని కథల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చేసింది. సంపత్ నందితో 'గాంజా శంకర్' సినిమా అనుకున్నప్పటికీ అనివార్యకారణాలతో అది మధ్యలోనే ఆగిపోయింది. చివరిగా రోహిత్ కె.పి అనే కొత్త దర్శకుడిని రంగంలోకి దించాడు సాయితేజ్. ప్రస్తుతం అతడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ప్రైమ్ షో ఎటర్ టైన్ మెంట్స్ దీన్ని నిర్మిస్తుంది. ఇందులో సాయితేజ్‌కి జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఇందులో కీలకమైన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించారు. తాజాగా తదుపరి భారీ షెడ్యూల్ వేస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం ఏకంగా 12 ఏకరాల్లో ప్రత్యేకంగా సెట్ నిర్మిస్తున్నారుట. ఇందులో ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించ నున్నారు.
ఇక 12 ఎకరాల్లో సెట్ అంటే చిన్న విషయం కాదు. ఈ రేంజ్ లో సెట్లు ఇంతవరకూ రాజమౌళి, శంకర్ సినిమాలకు కూడా వేసి ఉండరు. వాళ్ల సినిమాలకు మహా అయితే 10 ఎకరాల్లో సెట్లు వేసారు. కానీ సాయి తేజ్ కోసం 12 ఎకరాల్లోనే సెట్ వేస్తున్నారు. సెట్ నిర్మాణానికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. భారీ ఎత్తున సెట్ నిర్మించడానికి కార్మికులు...ఇతర సిబ్బంది పని చేయాల్సి ఉంటుంది.
సాయితేజ్ కెరీర్ లోనే ఈ సెట్ ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోనుంది. ఇంతవరకూ అతడు నటించిన సినిమా లకు ఈ రేంజ్ లో సెట్లు వేసింది లేదు. పాటలకు..అవసరం మేర కొన్ని సన్నివేశాలకు తప్ప. మరి 12 ఎకరాల సెట్ అనేది స్టోరీ డిమాండ్ మేరకు వేస్తున్నారా? ఇంకేదైనా స్టోరీ ఉందా? అన్నది తెలియాలి.