మేనల్లుడు కూడా మామ మార్గంలోనే!
మెగాస్టార్ చిరంజీవి అండదండలతోనే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి అండదండలతోనే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇంతింతై వటుడింతై చందంగా ఇండస్ట్రీలో ఎదిగాగు. నటుడిగా కంటే వ్యక్తిగతంగా అభిమానుల హృదయా లకు దగ్గరయ్యాడు. అందుకే అభిమానుల గుండెల్లో దేవుడయ్యాడు. చేసిన సేవా కార్యక్ర మాలు.. అభిమానుల పట్ల పవన్ నడుచుకున్న విధానమే అతనిడి ఆ స్థాయికి తీసుకెళ్లింది అన్నది వాస్తవం. నేడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణిస్తున్నాడు అంటే దానికి కారణం కూడా చిరంజీవి వేసిన బీజమే.
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అద్యక్షుడిగా పవన్ రాజకీయ ప్రస్తానం మొదలైంది. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత పవన్ లో సొంతగా ఎదిగాలి అనే పోరాట పటిమ మొదలైంది. అలా మొదలైన ప్రయాణం నేడు ఉప ముఖ్యమంత్రి పదవి వరకూ తీసుకెళ్లగలిగింది. అతడి ప్రయాణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సహించడం కూడా ఎంతో కీలకమైన పరిణామం. ఆయన చలవతోనే డీసీఎం పదవి సాద్యమైంది.
తాజాగా మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తీరు కూడా మేనమామ పవన్ కళ్యాణ్ విధానాన్నే స్మరిస్తుంది. సాయితేజ్ నటుడైన తర్వాత సేవా కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా ఉంటున్నాడు. సహాయం అంటూ ముందుకు వచ్చే గుణం తనలో అలవరింది. సొంతంగా ఛారిటీ చేస్తున్నాడు. అలాగే జనసేన పార్టీ తరుపును తాను చేయాలనుకున్న సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నాడు.
ఆ మధ్య సేఫ్ హ్యాండ్స్ అంటూ ఎంత ఫేమస్ అయ్యాడో తెలిసిందే. ఇక ఏపీ రాజకీయాల్లోనూ జనసేనకు మద్దతుగా నిలుస్తున్నాడు. ఎన్నికల సమయంలో పవన్ తరుపును పిఠాపురంలో ప్రచారం చేసాడు. అంతకు ముందుకు వైకాపా వ్యతిరకంగానూ స్పందించాడు. ఇప్పటికీ ఆవిధానాన్ని అవసరం మేర కొనసాగిస్తున్నాడు. వైకాపా అతడిపై చేస్తోన్న ట్రోలింగ్ లకు ధీటుగా స్పందింస్తున్నాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ స్పూర్తితోనే అల్లుడు సాయితేజ్ ముందుకు సాగుతున్నాడనిపిస్తుంది.