'సంబరాల యేటి గట్టు' కోసం సాయి పాట్లు..!
మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం రోహిత్ దర్శకత్వంలో 'సంబరాల యేటి గట్టు' అనే చిత్రంలో నటిస్తున్నాడు.
మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం రోహిత్ దర్శకత్వంలో 'సంబరాల యేటి గట్టు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు అయిన కె పి రోహిత్ ఈ సినిమాను విభిన్నంగా రూపొందిస్తున్నాడు. అంతే కాకుండా సినిమాలో తేజ్‌ను విభిన్నంగా చూపించబోతున్నాడు. ఇటీవల రామ్ చరణ్ గెస్ట్‌గా సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఆ సమయంలోనే సినిమాలో సినిమాలో తేజ్ లుక్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చూపించారు. సిక్స్ ప్యాక్ బాడీతో వారియర్ లుక్‌లో తేజ్ కనిపించబోతున్నాడు. ఆ లుక్‌ను చేరుకోడం కోసం తేజ్ చాలా కష్టపడ్డాడు. ఇంకా చాలా కష్టపడుతూనే ఉన్నాడు.
ప్రతి రోజు గంటల తరబడి వర్కౌట్స్ చేస్తున్నాడని, ప్రముఖ ట్రైనర్ సమక్షంలో తేజ్ కఠిన శ్రమకు ఓర్చి వర్కౌట్స్ చేయడం వల్లే సినిమాలో అంతగా కనిపించబోతున్నాడు అంటూ ఈ వీడియోను చూస్తే అనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సాయి దుర్గ తేజ్ వర్కౌట్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఒక సినిమా కోసం ఎంత కష్టపడేందుకు అయినా సిద్ధం అన్నట్లుగా తేజ్ ఉంటాడు. గతంలోనూ ఇలా ఒక పాత్ర కోసం చాలా కష్టపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా సాయి దుర్గ తేజ్ కష్టపడుతున్నాడు అంటూ ఆయన సన్నిహితులు యూనిట్ సభ్యులు అంటున్నారు.
కొన్ని కారణాల వల్ల దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సాయి దుర్గ తేజ్ ఎట్టకేలకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అందులో మొదటగా సంబరాల యేటి గట్టు సినిమాతో రాబోతున్నాడు. పూర్తిగా కొత్త కాన్సెప్ట్, తెలుగులో ఇప్పటి వరకు చూడని సబ్జెక్ట్ అనే ప్రచారం జరుగుతోంది. కమర్షియల్ సినిమాల కంటే నటుడిగా తనకు పేరు వచ్చే సినిమాలు చేయాలని కోరుకునే తేజ్ ఈ సినిమాతో కచ్చితంగా నటుడిగా మరో పది మెట్లు ఎక్కడంతో పాటు కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ సినిమాలో ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించబోతుంది. సాయి దుర్గ తేజ్‌కి ఈ అమ్మడు సరైన జోడీ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కీలక పాత్రలో జగపతిబాబు, సాయి కుమార్‌లు నటించబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. సినిమాలో వారి పాత్రలు ఎలా ఉంటాయి అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అనన్య నాగళ్లను ముఖ్య పాత్రలో చూడబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించబోతున్నాడు. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. చైతూ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందబోతుంది.