సాయి దుర్గ తేజ్ నెవ్వర్ బిఫోర్ రోల్.. ఇదే కదా కావాల్సింది!
ఇదిలా ఉంటే, తేజ్ జీవితంలో ఎదురైన ముఖ్యమైన అడ్డంకులను అధిగమించి, ఇలా వెనక్కి తిరిగి రావడం నిజంగా ప్రేరణగా నిలుస్తుంది.
పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించడానికి సాయి దుర్గ తేజ్ (SDT) మళ్లీ కొత్త లుక్‌తో స్క్రీన్‌పైకి రాబోతున్నారు. "సంబరాల యేటిగట్టు" అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ఆయన తన ట్రాన్స్‌ఫార్మేషన్‌ను ప్రదర్శిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. ఈ సినిమాలో దుర్గ తేజ్ పాత్రను ఎంతో ఫెరోషియస్‌గా డిజైన్ చేయడం విశేషం. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ చిత్రానికి సంబంధించిన కార్నేజ్ వీడియో విడుదలైంది. అందులో కనిపించిన తేజ్ కొత్త లుక్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతోంది.
వీడియోలో సిక్స్ ప్యాక్ బాడీతో, ఒడిదుడుకుల మధ్య విలన్లను ఊచకోత కొస్తూ కనిపించారు. కసితో పీటలు కూల్చేలా తెరపై కనిపించిన లుక్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. SDT బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ మాత్రం స్టన్ అయ్యేలా అనిపించింది. ప్రత్యేకమైన డైట్, కఠినమైన వర్కౌట్ రొటీన్‌ను ఫాలో అవుతూ, ఆయన తన ఫిజిక్‌ను అత్యంత అందంగా తీర్చిదిద్దారు. అభిమానులు ఈ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఇదిలా ఉంటే, తేజ్ జీవితంలో ఎదురైన ముఖ్యమైన అడ్డంకులను అధిగమించి, ఇలా వెనక్కి తిరిగి రావడం నిజంగా ప్రేరణగా నిలుస్తుంది. గతంలో ఒక ప్రమాదానికి గురైన సాయి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ తిరిగి కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ట్రాక్ లోకి వచ్చి, అంతకుమించిన శ్రమతో నిపుణుల సహకారంతో ఈ లుక్‌ను సాకారం చేసుకున్నారు. ఈ సరికొత్త అవతారం అభిమానుల్లో కొత్త ఆశలు రేపుతోంది.
కార్నేజ్ వీడియోను చూస్తే, దర్శకుడు రోహిత్ కేపీ విజన్ ఎంత ప్రత్యేకమో స్పష్టమవుతోంది. తొలి చిత్రంలోనే ఇంత గొప్పగా చూపించడానికి దర్శకుడి కృషి ప్రధానంగా నిలుస్తుంది. "సంబరాల యేటిగట్టు" లో తేజ్ పాత్రకు జోడించిన అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమాకు మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలవనున్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా కార్నేజ్ వీడియోను విడుదల చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. సాయి డెడికేషన్ గురించి చెబుతూ, సాయి దుర్గ తేజ్ ఓ కొత్త తరహా కంటెంట్ ను తెరపై చూపించబోతున్నాడు," అంటూ రామ్ చరణ్ వివరణ ఇచ్చారు. ఈ మాటలు అభిమానుల్లో మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 25 న విడుదల చేయనున్నారు.
ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ్ ఈ చిత్రంతో తన కెరీర్‌లో మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త దర్శకుడి కాంబినేషన్‌తో తేజ్ మరోసారి తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి బరిలోకి దిగుతున్నారు. "సంబరాల యేటిగట్టు" సినిమాతో SDT కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో తన స్థానాన్ని మరింత బలపరచడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. మరి సినిమా ఏ స్తాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.