మెగా ఫ్యాన్స్ అదర్ హీరో ఫ్యాన్స్.. తేజూ టచ్ చేశాడు..!
సాయి దుర్గా తేజ్ హీరోగా రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సంబరాల ఏటిగట్టు గ్లింప్స్ రిలీజ్ చేశారు.
సాయి దుర్గా తేజ్ హీరోగా రోహిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సంబరాల ఏటిగట్టు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రాం చరణ్ అతిథిగా వచ్చారు. తేజ్ 10 ఏళ్ల జర్నీ.. అతనికి జరిగిన యాక్సిడెంట్ గురించి చరణ్ మాట్లాడి ఎమోషనల్ అయ్యారు. తేజూ గాడి ప్రేమ బండ ప్రేమ అన్నారు. సంబరాల ఏటిగట్టు విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుతున్నానని అన్నారు.
ఇక మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ అందరికీ గుండెల మీద చేయి వేసుకుని బైక్ మీద వెళ్లేప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని వెళ్తానని జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద.. ప్రేమించిన అమ్మాయి మీద ప్రామిస్ చేయించాడు. అది పెట్టుకుని వెళ్లడం వల్లే నేను ఇప్పుడు ఇవాళ బ్రతికి ఉన్నాను. దయచేసి మీరు ప్రామిస్ చేశారు కాబట్టి ఇవాళ నుంచి బయటకు వెళ్లేప్పుడు మీరు హెల్మెట్ ధరించి వెళ్లండని అన్నారు. కేవలం మెగా హీరోలకే కాదు అదర్ హీరో ఫ్యాన్స్ కి ఈ మెసేజ్ ఇచ్చాడు. తేజూ మంచి మనసు ఏంటో అతను కేవలం మెగా ఫ్యాన్స్ కే కాదు అదర్ హీరో ఫ్యాన్స్ అంటూ చెప్పడం చూసి అర్ధం చేసుకోవచ్చు.
ఈ స్టేజ్ మీద ఉండటానికి కారణమైన ముగ్గురు మామయ్యలకు ఎప్పుడు దాసోహమై ఉంటా.. ఎప్పుడు వారికి రుణపడి ఉంటాను.. థాంక్ యు సో మచ్.. మీ ప్రేమను పొందే అవకాశం దక్కింది. మీ ఆశీస్సులే నన్ను ఇక్కడ దాకా తీసుకొచాయి. మా చరణ్. మీ చరణ్.. మన అందరి చరణ్.. ఈ ఫంక్షన్ కి వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు థాంక్స్. తన సినిమా గేమ్ ఛేంజర్ జనవరి 10న రిలీజ్ ఉంది. అయినా నా కోసం వచ్చాడు చరణ్. అందుకు థాంక్స్.. నాకోసం ఈరోజు వచ్చిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరికీ థాంక్స్.
మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి.. మెగా ఫ్యాన్స్ ఫ్యాన్స్ ప్రేమను ఎప్పుడూ ఇలానే పొందాలి అంటూ మల్లోసారి బయటకు వెళ్లేప్పుడు హెల్మెట్ ధరించి వెళ్లండి అని చెప్పి స్పీచ్ ముగించాడు తేజ్. ఐతే సినిమా గురించి ఏమి మాట్లాడలేదు. దానికి ఇంకా చాలా వేదికలు ఉన్నాయని అన్నారు సాయి దుర్గ తేజ్.