12 ఎకరాల్లో భారీ సెట్.. మెగా హీరో మూవీ క్రేజీ అప్డేట్..
ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ఒక యాక్షన్ ప్యాక్ షెడ్యూల్ పూర్తి చేసుకునని తెలుస్తుంది.
మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ బ్రో సినిమా తర్వాత అసలైతే సంపత్ నందితో ఒక సినిమా చేయాల్సి ఉన్నా ఆ ప్రాజెక్ట్ ఎందుకో సెట్స్ మీదకు వెళ్లెకుండానే క్యాన్సిల్ అయ్యింది. తేజ్ నెక్స్ట్ సినిమా అదే తన 18వ సినిమాను రోహిత్ అనే నూతన దర్శకుడితో చేస్తున్నాడు. తేజ్ నెక్స్ట్ సినిమాను హనుమాన్ మూవీ ప్రొడక్షన్ ప్రైం షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ఒక యాక్షన్ ప్యాక్ షెడ్యూల్ పూర్తి చేసుకునని తెలుస్తుంది.
సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో భారీ సెట్ వేసి అందులో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. విరూపాక్ష సూపర్ హిట్ తర్వాత మామ పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా చేశాడు సాయి తేజ్. ఐతే మధ్యలో చాలా కథలు విన్నా ఏది అంత నచ్చలేదు. ఫైనల్ గా రోహిత్ చెప్పిన కథ లాక్ చేశాడు. కంటెంట్ విషయంలో తేజ్ ఇక మీదట చాలా జాగ్రత్త వహించాలని ఫిక్స్ అయ్యాడు. హనుమాన్ మేకర్ నిరంజన్ రెడ్డి ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట.
ఆల్రెడీ జరిగిన షెడ్యూల్ లో యాక్షన్ పార్ట్ పూర్తి కాగా.. 12 ఎకరాల్లో భారీ సెట్ లో కూడా అదిరిపోయే యాక్షన్ బ్లాగ్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. తేజ్ 18వ సినిమా సెకండ్ షెడ్యూల్ 15 రోజుల దాకా యాక్షన్ కొరియోగ్రాఫర్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలుస్తుంది. సాయి తేజ్ సినిమాల్లో ఇదివరకు ఎప్పుడు చూడని విధంగా ఈ యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమా కోసం తేజ్ తన లుక్స్ కూడా మార్చినట్టు సమాచారం.
కథకు కావాల్సినంత బడ్జెట్ నిర్మాతలు ఇచ్చేస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళంతో పాటుగా హిందీ బాషల్లో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. సాయి తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ తెలియాల్సి ఉంది. కొన్నాళ్లుగా యాక్షన్ సినిమాలకు దూరంగా ఉన్న సాయి తేజ్ కచ్చితంగా ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ ఆకలి తీరుస్తాడని చెప్పొచ్చు.