పిక్‌టాక్ : లేడీ పవర్ స్టార్ కటౌట్ అదిరింది
తెలుగు సినిమా ప్రేక్షకుల్లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారికి ఉన్న క్రేజ్ నేపథ్యంలోనే ఈ కటౌట్ ఏర్పాటు చేశారు.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మొదటి రోజు దాదాపుగా రూ.20 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. నాగ చైతన్య కెరీర్‌లోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా తండేల్ నిలిచింది. సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి మరీ నటించారు. ఇద్దరూ డాన్స్‌లో మెప్పించారు. చందు మొండేటి రియల్ కథను కమర్షియల్ టచ్ ఇచ్చి, ప్రేమ కథగా మలచిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. సినిమాలోని లవ్ స్టోరీ యూత్ ఆడియన్స్ థియేటర్‌కి మళ్లీ మళ్లీ వచ్చేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు. సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున కటౌట్స్ ఏర్పాటు చేశారు.
సాధారణంగా స్టార్ హీరో సినిమాలు విడుదల సమయంలో ఫ్యాన్స్ భారీ ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉంటాం. తండేల్ సినిమాకు సైతం నాగ చైతన్యకు భారీ ఎత్తున కటౌట్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో వైజాగ్‌లోని సంగం థియేటర్ వద్ద సాయి పల్లవికి గాను భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. హీరోయిన్స్‌కి కటౌట్ పడటం ఇదే ప్రథమం అంటూ సాయి పల్లవి అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో ప్రముఖంగా షేర్ చేస్తున్నారు. తెలుగు సినిమా ప్రేక్షకుల్లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారికి ఉన్న క్రేజ్ నేపథ్యంలోనే ఈ కటౌట్ ఏర్పాటు చేశారు.
అభిమానులు ముద్దుగా లేడీ పవర్ స్టార్ అంటూ పిలుచుకునే సాయి పల్లవి శూలం పట్టుకుని డాన్స్ చేస్తున్న స్టిల్ బాగా వైరల్ అయ్యింది. అదే ఫోటోతో సంగం థియేటర్ వద్ద ఫ్యాన్స్ కటౌట్ ఏర్పాటు చేశారు. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సాయి పల్లవి కటౌట్‌ని ఫ్యాన్స్ ఏర్పాటు చేయడంతో అటుగా వెళ్తున్న వారు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. స్థానికంగా సినిమాపై ఆసక్తిని పెంచడంలోనూ సాయి పల్లవి కటౌట్ కీలకంగా మారింది. మొత్తానికి సాయి పల్లవి కటౌట్ పెట్టి ఫ్యాన్స్ అరుదైన గౌరవంను ఆమెకు కట్టబెట్టారు. టాలీవుడ్‌లో ఆచితూచి సినిమలు ఎంపిక చేస్తున్న సాయి పల్లవి మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
గత ఏడాది అమరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ దక్కించుకున్న సాయి పల్లవి ఈ ఏడాది ఆరంభంలోనే తండేల్ సినిమాతో నాగ చైతన్యతో కలిసి సక్సెస్ దక్కించుకుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు మొదటి నుంచి భారీగా పెరిగాయి. చందు మొండేటి భారీ బడ్జెట్‌తో సాయి పల్లవి, నాగ చైతన్యను పూర్తి స్థాయిలో వినియోగించుకుని ఒక మంచి సినిమాను తీసుకు వచ్చారు. మొదటి రోజు భారీ వసూళ్లు నమోదు చేయగా, రెండో రోజూ అదే ట్రెండ్ కొనసాగుతోంది. శనివారం, ఆదివారం కలెక్షన్స్‌తో సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ రన్‌లో నాగ చైతన్య ఆల్ టైమ్ అత్యధిక వసూళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.