సాయిపల్లవి బాలీవుడ్‌లో సెటిలైనట్టే
నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రణబీర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తోంది.
సౌతిండియాలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది సాయిపల్లవి. తనదైన నటప్రతిభ, డ్యాన్సింగ్ స్కిల్స్ తో భారీ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తున్న సాయిపల్లవి స్టార్ డమ్ పరంగా చాలా ఎత్తుకు ఎదిగింది. త్వరలోనే ఈ బ్యూటీ 'రామాయణం' లాంటి భారీ చిత్రంతో హిందీ పరిశ్రమకు పరిచయం అవుతోంది. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రణబీర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తోంది.
ఈ సినిమా తర్వాత కూడా సాయిపల్లవి హిందీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తదుపరి బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన సాయిపల్లవి నటిస్తోంది. తాజాగా హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో జునైద్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ సాయిపల్లవిత సినిమాని కన్ఫామ్ చేసారు. 2024లో.. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన 'లవ్యాపా' చిత్రాన్ని పూర్తి చేశానని జునైద్ పేర్కొన్నాడు. ఇందులో ఖుషి కపూర్ కథానాయిక. ఫిబ్రవరిలో విడుదల కానుంది.
తన తండ్రి అమీర్ ఖాన్ నిర్మించిన మరో చిత్రం 2025లో విడుదల కానుందని, ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోందని కూడా తెలిపాడు. రెండు ప్రాజెక్ట్‌లపైనా అతడు ఉత్సాహాన్ని వ్యక్తం చేసాడు. తదుపరి వరుస చిత్రాల్లో అవకాశాలొస్తున్నాయని కూడా జునైద్ అన్నాడు. థియేటర్- రంగస్థల ప్రదర్శనలపై అభిరుచి తరగనిది అని జునైద్ వెల్లడించాడు. తాను తన తండ్రి అమీర్ ఖాన్ తరహాలోనే 'థియేటర్ పర్సనాలిటీ' అని తెలిపాడు. థియేటర్ గొప్ప ప్రాక్టీస్ స్పేస్ అని కూడా అన్నాడు. తన తండ్రి అమీర్ ఖాన్ 80వ దశకంలో రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారని కూడా తెలిపాడు. తన తండ్రితో తనను పోల్చడం వల్ల ఒత్తిడి పెరుగుతుందన్నాడు. బౌతిక రూపురేఖల పరంగా తన తండ్రి అమీర్ ఖాన్ కి, తనకు చాలా వేరియేషన్స్ ఉన్నాయని కూడా జునైద్ వ్యాఖ్యానించారు.