సాయి పల్లవి 'రామాయణం' ఏం జరుగుతోంది?

ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై 'రామాయణం' ఎన్నో సార్లు వచ్చింది.

Update: 2024-11-04 07:30 GMT

ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై 'రామాయణం' ఎన్నో సార్లు వచ్చింది. వెండితెరపై, బుల్లి తెరపై, ఓటీటీ ద్వారా పదుల సార్లు 'రామాయణం' మళ్లీ మళ్లీ చూసినా ఫిల్మ్‌ మేకర్స్ మాత్రం రామాయణం మేకింగ్‌ కి వెనక్కి తగ్గడం లేదు. కొన్నాళ్ల క్రితం ప్రభాస్‌ రాముడిగా 'రామాయణం' కథతో ఆదిపురుష్‌ సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా టెక్నికల్‌గా బాగా లేదు అంటూనే ప్రేక్షకులు భారీ ఎత్తున చూసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ హిందువులు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణం' సినిమా వైపు ఆసక్తిగా చూస్తున్న విషయం తెల్సిందే.

రణబీర్‌ కపూర్‌ రాముడి పాత్రలో నటిస్తూ ఉండగా, సాయి పల్లవి సీతాదేవి పాత్రలో కనిపించబోతున్న ఈ రామాయణంలో రావణుడి పాత్రను కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ పోషిస్తున్నారు. ఆయన ఈ సినిమా నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు. ఆ విషయాన్ని స్వయంగా ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రణబీర్‌ కపూర్‌ వంటి యంగ్‌ అండ్‌ క్రేజీ స్టార్‌ రాముడి పాత్రలో నటిస్తున్నాడు అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. ఇక సౌత్‌ లో లేడీ పవర్‌ స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సాయి పల్లవి సీతాదేవి పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఇక్కడ భారీగా పెరిగాయి. నార్త్‌ తో పాటు సౌత్‌లోనూ రణబీర్ కపూర్‌ సాయి పల్లవిల 'రామాయణం' పై అంచనా ఆకాశాన్ని తాకేలా ఉండటంతో మేకింగ్‌ స్పీడ్‌ గా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఆ మధ్య ఒక షెడ్యూల్‌ పూర్తి చేసిన మేకర్స్‌ కొత్త షెడ్యూల్‌ కోసం సెట్‌ వర్క్‌ పూర్తి చేశారు. ఈ నెలలోనే సాయి పల్లవితో పాటు ఇతర నటీనటుల పై కీలక సన్నివేశాల చిత్రీకరణకు దర్శకుడు నితేష్‌ తివారీ ప్లాన్‌ చేస్తున్నారు. మూడు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్‌ పూర్తిగా సాయి పల్లవికి సంబంధించిన సన్నివేశాలని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌ లో రణబీర్‌ కపూర్‌, సాయి పల్లవి కాంబో సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం రణబీర్‌ కపూర్‌ డేట్లు కుదరని కారణంగా సాయి పల్లవి సోలో సన్నివేశాల షూట్‌ చేయబోతున్నారు. సాయి పల్లవి సీతాదేవి పాత్రలో ఎలా ఉంటుందా అంటూ ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో త్వరలో ఫస్ట్‌ లుక్ విడుదల ఉండే అవకాశాల ఉన్నాయని సమాచారం అందుతోంది.

రణబీర్‌, సాయి పల్లవి, యశ్‌లతో పాటు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో సన్నీ డియోల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, లారా దత్తా, ఇంకా బాలీవుడ్‌ స్టార్స్ కొందరు గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వబోతున్నారు. మొదటి షెడ్యూల్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ కావడంతో సెకండ్‌ షెడ్యూల్‌ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య షూటింగ్‌ చేయబోతున్నారు. సినిమా నుంచి ఇకపై ఎలాంటి లీక్ రాకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది. రెండు లేదా మూడు పార్ట్‌లుగా రామాయణంను విడుదల చేయాలని భావిస్తున్నారు. మొదటి పార్ట్‌ ను 2026లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇండియన్‌ భాషల్లోనే కాకుండా అన్ని భాషల్లోనూ సినిమా విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట.

Tags:    

Similar News