చైతూని మ్యాచ్ చేయలేకపోయా: సాయి పల్లవి
గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. చైతూ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో తండేల్ రూపొందింది.
ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజయ్యాక తండేల్ పై ఉన్న అంచనాలు నెక్ట్స్ లెవెల్ కు చేరుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న తండేల్ సినిమాని అన్ని ప్రధాన నగరాల్లో ఈవెంట్లు చేసి మరీ ప్రమోట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి తన కో స్టార్ అయిన నాగ చైతన్యను ఆకాశానికెత్తేసింది. తండేల్ లో నాగచైతన్య ఓ సీక్వెన్స్ లో చేసిన పెర్ఫార్మెన్స్ ను మ్యాచ్ చేయడానికి తాను రీ టేక్ చేయాల్సి వచ్చిందని సాయి పల్లవి తెలిపింది. పల్లవి మాటల్ని బట్టి చూస్తే చైతన్య తనలోని నటుడిని ఏ రేంజ్ లో బయటపెట్టాడో అర్థమైపోతుంది.
ఈ సినిమా కోసం నాగ చైతన్య ఎంతో కష్టపడి జుట్టు, గెడ్డం పెంచి మేకోవర్ చేశాడని ఆల్రెడీ అందరికీ తెలుసు. ఇప్పుడు సాయి పల్లవి చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తండేల్ కోసం నాగ చైతన్య ప్రాణం పెట్టాడని అర్థమవుతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి గతంలో లవ్ స్టోరీ సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి చేస్తుండటంతో తండేల్ పై అంచనాలు నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయి.
ఇదిలా ఉంటే తండేల్ కు ఇప్పటికే భారీ హైప్ వచ్చేసింది. ఇప్పటికే రిలీజైన మూడు పాటలు ఒకదాన్ని మించి మరొకటి చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ గ్రాండ్ గా జరగనుండగా, ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా హాజరు కాబోతున్నాడు.