బ్రేక్ ను కవర్ చేసేందుకు తేజూ షార్ట్ ఫిల్మ్?
బ్రేక్ తీసుకున్న సమయంలో తేజ్ నుండి ఒక షార్ట్ ఫిల్మ్
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ బ్రేక్ తర్వాత 'విరూపాక్ష' సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ విజయాన్ని విరూపాక్ష దక్కించుకుంది. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆ సినిమా తర్వాత తేజ్ 'బ్రో' తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.
మొదటి సారి మామయ్య పవన్ కళ్యాణ్ తో నటించిన సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా బ్రో సినిమా ఉంటుందనే నమ్మకంను అభిమానులు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక 'బ్రో' సినిమా రిలీజ్ తర్వాత నాలుగు అయిదు నెలల పాటు సాయి ధరమ్ తేజ్ బ్రేక్ తీసుకోబోతున్నాడట.
యాక్సిడెంట్ సమయంలో జరిగిన సర్జరీల తాలూకు ఎఫెక్ట్ తేజ్ పై ఇంకా ఉందట. పైగా ఒకటి రెండు సర్జరీలు మళ్లీ చేయాల్సి ఉందట. అందుకే పూర్తిగా విశ్రాంతి తీసుకుని ఫిట్ గా రీ ఎంట్రీ ఇవ్వాలని సాయి ధరమ్ తేజ్ ఆశ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల బ్రో ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని తేజ్ చెప్పుకొచ్చాడు.
బ్రేక్ తీసుకున్న సమయంలో తేజ్ నుండి ఒక షార్ట్ ఫిల్మ్ రాబోతుందట. ఇప్పటికే ఆ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ పూర్తి అయిందని.. త్వరలోనే దాని పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నాడు. ప్రస్తుతానికి ఆ షార్ట్ ఫిల్మ్ గురించి ఏమీ చెప్పలేను కానీ త్వరలోనే వస్తుందని మాత్రం పేర్కొన్నాడు
సాయి ధరమ్ తేజ్ ఎలాగూ నాలుగు అయిదు నెలల పాటు బ్రేక్ తీసుకుంటున్నాడు. కనుక ఆ బ్రేక్ లో కొంత మొత్తం ను అయినా కవర్ చేసే విధంగా ఈ షార్ట్ ఫిల్మ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది.