డాటర్ కోసం డాడ్ మళ్లీ మెగాఫోన్ పట్టాలా?
చిన్న నాటి నుంచి ఇంట్లో సినిమా వాతావరణమే కాబట్టి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదనే భామలు ఎక్కువగా ఉంటారు.
బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ ఎంట్రీ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కొత్త వాళ్లతో పాటు పేరున్న సెలబ్రిటీల పిల్లలంతా కూడా మ్యాకప్ వేసుకోవడానికే ఆసక్తి చూపిస్తుంటారు. తండ్రి వారసత్వమో! మామ్ నుంచి వస్తోన్న వారసత్వాన్నో కొనసాగించడానికి కుమార్తెలు కూడా ఏమాత్రం వెనకడుగు వేయరు. చిన్న నాటి నుంచి ఇంట్లో సినిమా వాతావరణమే కాబట్టి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదనే భామలు ఎక్కువగా ఉంటారు.
అలాగే ఎంట్రీ ఇచ్చింది సయి మంజ్రేకర్. బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. `దబాంగ్ 3` తో బాలీవుడ్ లో నటించిన అమ్మడు అటుపై `గని` సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. `మేజర్` ,` స్కంద` లాంటి సినిమాలు చేసింది. హిందీలో కంటున్యూటీగా మరో రెండు సినిమాలు చేసింది. ఈ మధ్యనే అరోన్ మెన్ కహాన్ ధమ్ తా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మరి ఈ సినిమా ఫలితాల పరిస్థితి ఏంటి? అంటే వాటిలో ఒక్క మేజర్ తప్ప మిగిలినవేవి బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. తాజాగా సినిమా `అరోన్ మెన్ కహాన్ ధమ్` తో కూడా నిరాశనమే మిగిల్చింది. ఈ సినిమాపై సయి చాలా ఆశలే పెట్టుకుంది. కానీ ఫలితం ఆశించిన విధంగా రాలేదు. ప్రస్తుతం చేతిలో కొత్త అవకాశాలు కూడా లేవు. హిందీ సహా ఇతర భాషల్లోనూ ఛాన్సులు రాలేదు. దీంతో అమ్మడి కోసం డాడ్ మళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కుతారు అనే ప్రచారం జరుగుతోంది.
డాడ్ తో కలిసి పనిచేయాలని ఉందని సయి ఇప్పటికే రివీల్ చేసింది. ఈ మాట తాను నటిగా బిజీగా ఉన్నప్పుడు చెప్పింది. వచ్చే ఏడాది జరిగే అవకాశం ఉందని తెలిపింది. కానీ ఇప్పుడు అమ్మడు ఖాళీ అయిన నేపథ్యం లో ఇదే ఏడాది అందుకు ఛాన్స్ ఉంటుందేమో చూడాలి. డాడ్ మహేష్ మంజ్రేకర్ మంచి నటుడే కాదు. అంతకు మించి గొప్ప దర్శకుడు కూడా. బాలీవుడ్ లో ఇప్పటి వరకూ కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసారు. 20 ఏళ్ల క్రితమే దర్శకుడిగా..నటుడిగా ప్రయాణం మొదలు పెట్టారు.