జువెల్ థీఫ్: ఇలాంటి దొంగను చూసి ఉండరు
తాజా మీడియా కథనాల ప్రకారం.. సైఫ్- జైదీప్‌ల హీస్ట్ థ్రిల్లర్ మార్చి 2025 చివరి నాటికి విడుదల కానుంది.;
సైఫ్ అలీ ఖాన్ - జైదీప్ అహ్లవత్ ప్రధాన పాత్రల్లో నటించిన 'జ్యువెల్ థీఫ్' ఈ సంవత్సరం మోస్ట్ అవైటెడ్ OTT విడుదలలలో ఒకటి. సిద్ధార్థ్ ఆనంద్ సమర్పణలో, రాబీ గ్రెవాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. గత నెలలో ముంబైలో జరిగిన 'నెక్ట్ ఆన్ నెట్‌ఫ్లిక్స్' ఈవెంట్‌లో మేకర్స్ జ్యువెల్ థీఫ్ అధికారిక టీజర్‌ను ఆవిష్కరించారు.
ఈ టీజర్ కి అద్భుత స్పందన వచ్చింది. శాక్ర్ డ్ గేమ్స్ తర్వాత సైఫ్ కి ఇది సరైన ఓటీటీ సినిమా అని అంతా ప్రశంసించారు. జైదీప్ నటన ఇందులో వైవిధ్యంగా కుదిరిందని విజువల్స్ చెప్పాయి. ఇప్పటికే 'జ్యువెల్ థీఫ్' విడుదల తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది. తాజా మీడియా కథనాల ప్రకారం.. సైఫ్- జైదీప్‌ల హీస్ట్ థ్రిల్లర్ మార్చి 2025 చివరి నాటికి విడుదల కానుంది.
జాతీయ మీడియా కథనం ప్రకారం.. జ్యువెల్ థీఫ్ 27 మార్చి 2025న విడుదల చేసేందుకు నిర్మాతలు డేట్ లాక్ చేసారు. అయితే నెట్‌ఫ్లిక్స్ నుండి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ఈ హీస్ట్ థ్రిల్లర్‌కు సిద్ధార్థ్ ఆనంద్ - అతడి భార్య మమతా ఆనంద్ తమవంతు మద్దతునిచ్చారు. ఇది ప్రేక్షకుడు సీట్ అంచుకు జారిపోయేంత ఉత్కంఠతో సాగే, అద్భుతమైన థ్రిల్లర్ అని సిద్ధార్థ్ ఆనంద్ పదే పదే చెబుతున్నారు.
టీజర్ లాంచ్ సందర్భంగా, సైఫ్ జ్యువెల్ థీఫ్ విడుదల గురించి ఉత్సాహం వ్యక్తం చేశారు. తాను, సిద్ధార్థ్ చాలా కాలంగా ఈ సినిమా గురించి చర్చించుకున్నామని సైఫ్ గుర్తుచేసుకున్నాడు. ఎప్పుడూ దొంగతనాలపై సినిమా చేయాలనుకునేవాడిని అని తెలిపిన సైఫ్ ఖాన్ ఒక అందమైన సినిమాలో నటించానని అన్నాడు. తన పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయని జైదీప్ అహ్లావత్ చెబుతున్నాడు.
అయితే హీస్ట్ థ్రిల్లర్లు ఎప్పుడూ సీట్ ఎడ్జ్ కి జారి వీక్షించేంత ఉత్కంఠగా, గ్రిప్పింగ్ గా ఉండాలి. అందుకు అద్భుతమైన స్క్రీన్ ప్లే పనితనం అవసరం. దర్శకుడు రాబీ గ్రేవాల్ దీనిని సరిగా చేసాడా లేదా? అన్నది చూడాలి. జువెల్ థీఫ్ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.