సైఫ్‌పై దాడి చేసిన‌వాడు క‌రుగుగ‌ట్టిన నేరస్తుడు?

సైఫ్ పై దాడి అనంత‌రం ఇబ్ర‌హీం అలీఖాన్ త‌న తండ్రిని ఆస్ప‌త్రికి తీసుకుని వెళ్లాడ‌ని తొలుత క‌థ‌నాలొచ్చాయి. కానీ సైఫ్ తో వెళ్లింది ఏడేళ్ల బాలుడైన తైమూర్ అలీఖాన్.

Update: 2025-01-18 04:13 GMT

ముంబై- బాంద్రా నివాసంలో సైఫ్ ఖాన్ పై క‌త్తి దాడి క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. సైఫ్‌ కత్తిపోట్లకు గురైన 40 గంటల తర్వాత కూడా నిందితుడు ముంబై పోలీసుల నుండి తప్పించుకుంటూనే ఉన్నాడు. నేరం జరిగిన ప్రదేశం నుండి వెళ్లిపోయిన తర్వాత దర్యాప్తుదారులను తప్పుదారి పట్టించడానికి అతడు తెలివిగా త‌న‌ దుస్తులు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. దీనిని బ‌ట్టి అతడు 'కరుడుగట్టిన నేరస్తుడు' కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇప్ప‌టికే 40గం.లు అయింది. రెండో రోజూ స్థానిక పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ నుండి కనీసం రెండు డజన్ల బృందాలు నిందితుడి కోసం గాలింపు కొన‌సాగిస్తున్నాయి. అయినా దొంగ దొర‌క‌డు చిక్క‌డు. అత‌డు పోలీస్ కుక్క‌లు వాస‌న ప‌ట్ట‌కుండా దుస్తుల‌ను మార్చేస్తున్నాడు.

గురువారం తెల్లవారుజామున నటుడు సైఫ్ అలీ ఖాన్, అతడి ఇంటి సిబ్బందిపై దాడి చేసిన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తన బట్టలు మార్చుకుని భవనం నుండి పారిపోయాడు. అత‌డు బ‌య‌ట‌కు వెళ్లాక‌ తన దుస్తులు మార్చుకున్నాడు. లేత నీలం రంగు చొక్కా ధరించి కనిపించాడ‌ని, పోలీసుల‌ను త‌ప్పు దారి ప‌ట్టించే ప్ర‌య‌త్న‌మిద‌ని చెబుతున్నారు. మొత్తం రెండు డ‌జ‌న్ల టీమ్ లు అత‌డి కోసం వెతుకుతున్నాయి. అయినా అతడికి సంబంధించిన త‌దుప‌రి క్లూ కూడా ప‌ట్టుకోలేక‌పోయార‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. 40 గం.లుగా ముప్పు తిప్ప‌లు పెట్టిన అత‌డు క‌రుగు గ‌ట్టిన నేర‌స్తుడు! అని భావిస్తున్నారు.

కొడుకు షూటింగులు వాయిదా:

సైఫ్ పై దాడి అనంత‌రం ఇబ్ర‌హీం అలీఖాన్ త‌న తండ్రిని ఆస్ప‌త్రికి తీసుకుని వెళ్లాడ‌ని తొలుత క‌థ‌నాలొచ్చాయి. కానీ సైఫ్ తో వెళ్లింది ఏడేళ్ల బాలుడైన తైమూర్ అలీఖాన్. పెద్ద కొడుకు ఘ‌ట‌న స‌మ‌యంలో సైఫ్ ఉన్న బంగ్లాలోనే లేడు. అత‌డు వేరొక భ‌వంతిలో ఉంటాడ‌ని కూడా తెలుస్తోంది.

ఈ కష్ట స‌మ‌యంలో ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రితో ఉండటానికి 'డైలర్' షూటింగ్ వాయిదా వేసుకున్నాడ‌ని తెలిసింది. హిందూస్తాన్ టైమ్స్ క‌థ‌నం ప్రకారం.. ఇబ్రహీం అలీ ఖాన్ పటౌడీ తన తండ్రి కోసం షూటింగ్ వాయిదా వేసుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతే ఇబ్రహీం అలీ ఖాన్ షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారని క‌థ‌నంలో వెల్ల‌డించారు.

Tags:    

Similar News