పబ్లిక్ ఈవెంట్లో స్టార్ హీరోల వాగ్వాదం..అసలేం జరిగింది?
పబ్లిక్ ఈవెంట్లలో రసాభాస, ఒత్తిళ్లకు ఆస్కారం ఉన్నా కానీ, ఇద్దరు హీరోల నడుమ అనవసర వాగ్వాదం తలెత్తడం అనేది ఆశ్చర్యపరుస్తోంది.
పబ్లిక్ ఈవెంట్లలో రసాభాస, ఒత్తిళ్లకు ఆస్కారం ఉన్నా కానీ, ఇద్దరు హీరోల నడుమ అనవసర వాగ్వాదం తలెత్తడం అనేది ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటివి చాలా అరుదు.. చాలా సరదాగా సాగిపోయే కార్యక్రమంలో ఉన్నట్టుండి ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగిన ఫోటోలు అభిమానుల్లో ఇప్పుడు పలు సందేహాలను లేవనెత్తుతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొన్న వేడుకలో ప్రముఖ బాలీవుడ్ హీరోలు సైఫ్ అలీఖాన్, రణబీర్ కపూర్ నడుమ వాగ్వాదం కొనసాగింది. ఆ మేరకు ఎన్డీటీవీ తన కథనంలో వివరాలు వెల్లడించింది. పూర్తి డీటెయిల్స్ లోకి వెళితే...
లెజెండరీ నటుడు రాజ్ కపూర్ గౌరవార్థం ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్‌లో సైఫ్ అలీ ఖాన్, రణబీర్ కపూర్ మధ్య వాగ్వాదం జరిగిందని ఎన్డీటీవీ వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది. ఏదీ స్పష్టంగా చెప్పలేం కానీ వీడియో చూశాక అది వారి మధ్య వాగ్వాదంలానే అనిపిస్తోందని, ఈ శుక్రవారం ముంబైలో రాజ్ కపూర్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రారంభించే సమయంలో ఈ ఘర్షణ తలెత్తిందని ఎన్డీటీవీ పేర్కొంది.
ఈవెంట్లో సైఫ్ అలీఖాన్ - రణబీర్ కపూర్ కపూర్ తమ సతీమణులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు కలిసి ఫోటోలు దిగారు. అంతా సరదా వాతావరణమే. నవ్వులు చిందిస్తూనే ఉన్నారు. ఇంతలోనే ఆ ఇద్దరి నడుమా చిన్నపాటి వాగ్వాదం, రెడ్ కార్పెట్ మీద కాస్త ఒత్తిడి ఉన్నట్టు అనిపించిందని ఎన్డీటీవీ తన కథనంలో వెల్లడించింది. ఆ ఇద్దరు హీరోల ఫేసాఫ్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. రణబీర్ తనను స్క్రీనింగ్ వైపు తీసుకెళుతుండగా సైఫ్ చిరాకుగా కనిపించాడు. రణబీర్ అతనికి గైడ్ చేస్తున్నప్పుడు `ఓకే` అని ముఖాన్ని అదోలా పెట్టాడు. ఈ వేడుకలో సైఫ్ సతీమణి కరీనా, రణబీర్ సతీమణి ఆలియా భట్ కూడా కనిపించారు. ఈ ఫెస్టివల్ కోసం రణబీర్ కపూర్, సైఫ్ జోడీ గత వారం కపూర్ కుటుంబంతో కలిసి న్యూఢిల్లీలో ప్రధానిని కలిసిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించారు.
బబిత, నీతూ కపూర్, రిద్ధిమా కపూర్ సాహ్ని, కరిష్మా కపూర్ , మహేష్ భట్, రేఖ, కార్తీక్ ఆర్యన్, శర్వరి, సంజయ్ లీలా భన్సాలీ, ఫర్హాన్ అక్తర్, రేఖ, పద్మిని కొల్హాపురి, విక్కీ కౌశల్, బోనీ కపూర్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్, విక్కీ కౌశల్ సహా పలువురు తారలు రాజ్ కపూర్ సెంటినరీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజ్ కపూర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన నటించిన 10 అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రదర్శించారు. దాదాపు నాలుగు దశాబ్దాల నాటి రాజ్ కపూర్ క్లాసిక్స్ ప్రజల్ని అలరిస్తున్నాయి. ఆగ్ (1948), బర్సాత్ (1949), ఆవారా (1951), శ్రీ 420 (1955), జాగ్తే రహో (1956), జిస్ దేశ్ మే గంగా బహతీ హై (1960), సంగం (1964), మేరా నామ్ జోకర్ (1970), బాబీ (1973) మరియు రామ్ తేరీ గంగా మైలీ (1985) వంటి చిత్రాలను ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తున్నారు.