వారి కష్టానికి తగ్గ రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు: సాయి పల్లవి

తాజాగా ఒక వర్గం అందుకుంటున్న రెమ్యునరేషన్ విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Update: 2024-11-11 08:43 GMT

సౌత్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కూడా అందులో సాయి పల్లవికి ఉండే క్రేజ్ చాలా ప్రత్యేకమైంది. డిఫరెంట్ నటనతో విశేష గుర్తింపు పొందిన సాయిపల్లవి.. తాజాగా ఒక వర్గం అందుకుంటున్న రెమ్యునరేషన్ విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం అద్భుతమైన నటనతోనే కాకుండా సహజత్వానికి, ప్రామాణికతకు ప్రాధాన్యత ఇచ్చే ఈ టాలెంటెడ్ హీరోయిన్.. కష్టపడే వారికి తగినంత పారితోషం ఇవ్వడం లేదనే అంశంపై తన ఆవేదనను పంచుకున్నారు.

పరిశ్రమలో ఉన్న అనేక మంది హీరోయిన్లు తమ పారితోషికం కోసం పోరాడుతుంటే, సాయిపల్లవి మాత్రం తాను పనిచేస్తున్న వారి సంక్షేమం గురించి ఆలోచించడం విశేషం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, "మన పరిశ్రమలో సహాయ దర్శకులు అనేక కష్టాలు పడుతున్నారు. వారి శ్రమకు తగిన పారితోషం ఇవ్వకపోవడం నిజంగా బాధకరం" అని పేర్కొన్నారు.

అంతేకాకుండా బాలీవుడ్ పరిశ్రమలో సహాయ దర్శకులకు వారి కష్టానికి తగిన స్థాయిలో వేతనాలు ఉంటాయని, దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. “బాలీవుడ్లో ఒక సినిమా పూర్తి చేసిన సహాయ దర్శకుడు వెంటనే మరో ప్రాజెక్టుకు సిద్ధమవుతుంటాడు. కానీ మన దగ్గర మాత్రం వారి వేతనాలు సరైన స్థాయిలో ఉండకపోవడం వల్ల వారు తగిన గుర్తింపుని పొందడం కష్టమవుతోంది" అని అభిప్రాయపడ్డారు.

సాయి పల్లవి చేసిన కామేంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి సహాయక దర్శకులకు కొందరు ఏళ్లతరబడి తక్కువ జీతాలు అందుకుంటున్నారు. ఇలాంటి విషయాన్ని ఆమె హైలెట్ చేయడం.. మెచ్చుకోదగిన అంశం. ఇక సహజత్వానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే సాయిపల్లవి, కథలో తన పాత్రకు, కథకు తగిన ప్రాముఖ్యత ఉంటేనే సినిమాలు చేయడానికి ఒప్పుకుంటుంది.

అలాగే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఆఫర్స్ వచ్చినప్పుడు వెంటనే నో చెప్పింది. ఆ విధంగా భారీ పారితోషకాలు వదిలిపెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. యాడ్స్ చేయకపోవడం, స్కిన్ షోకు దూరంగా ఉండటం వంటి అంశాలు ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక ప్రస్తుతం ‘అమరన్’ చిత్రంలో తన అద్భుత నటనతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సాయిపల్లవి, త్వరలో తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే బాలీవుడ్ లో రామాయణం అనే సినిమాలో సీత పాత్ర కనిపించనుండి


Tags:    

Similar News