ఆస్పత్రిలో మాజీ భార్య.. సాయం కోసం AR రెహమాన్ పరుగు
సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ మాజీ భార్య సైరా బాను ఆకస్మిక ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. సైరా బానుకు అత్యవసర శస్త్రచికిత్స జరిగింది.
సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ మాజీ భార్య సైరా బాను ఆకస్మిక ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. సైరా బానుకు అత్యవసర శస్త్రచికిత్స జరిగింది. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సైరా బాను న్యాయవాది వందన షా సైరా బాను ఆసుపత్రిలో చేరి శస్త్రచికిత్స చేయించుకున్నారని తెలియజేశారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ సైరా బాను కృతజ్ఞతలు తెలిపారని, ఈ సమయంలో ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ షా ధన్యవాదాలు తెలిపారు.
తనకు సహకరించిన వారిలో తన మాజీ భర్త ఎ.ఆర్. రెహమాన్‌కు కూడా సైరా బాను కృతజ్ఞతలు తెలిపారు. దీనితో పాటు లాస్ ఏంజిల్స్‌లోని తన స్నేహితులు రసూల్ పూకుట్టి, అతడి భార్య షాదియాకు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అయితే సైరా బాను ఆసుపత్రిలో చేరడానికి కారణం వెల్లడి కాలేదు. 19 నవంబర్ 2024న ఎ.ఆర్. రెహమాన్ -సైరా బాను అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఎ.ఆర్. రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుండి విడిపోతున్నట్లు ప్రకటించింది. 29 ఏళ్ల అనుబంధానికి బ్రేక్ పడటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
అయితే ఈ ఇద్దరి మధ్య సంబంధం చాలా కాలంగా బాగా లేదు. పరస్పర గౌరవం, ప్రేమ ఉన్నప్పటికీ రెహమాన్ అతడి భార్య కలిసి ఉండలేమని భావించారు. కాపురంలో పెరిగిన ఒత్తిడి దూరాన్ని పెంచిందని సైరా ఆ ప్రకటనలో తెలిపింది. దాన్ని సరిదిద్దలేమని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని అన్నారు. వారు మనోవేదనను అనుభవించారు. తమ జీవితంలో చాలా కష్టమైన దశను ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమ వ్యక్తిగత జీవితాలను గౌరవించాలని సోషల్ మీడియాల ద్వారా ఆ ఇద్దరూ కోరారు.