ఇంకెక్కడ పెళ్లి బ్రో..అంతా బ్రో అని పిలుస్తున్నారు! సాయితేజ్
సాయితేజ్ మాట్లాడుతుండగా..పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా..ఆయన అంతే సరదాగా బధులిచ్చారు.' మీ అభిమానం పొందడం కోసమే ఈ ప్రాంతానికి వచ్చాను.
మెగా మేనల్లుడు సాయితేజ్-పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తొలిసారి పవన్ తో సాయితేజ్ తెరను పంచుకుంటున్నాడు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో ప్రచారం బాధ్యతలు మొత్తం సాయితేజ్ మోస్తున్నాడు. పవన్ రాజకీయ సమావేశాలతో బిజీగా ఉండటంతో 'బ్రో' ప్రచారంలో పాల్గొనలేకపోతున్నారు.
తాజాగా తిరుపతి ప్రచార కార్యక్రమంలో ఉన్న సాయితేజ్ అభిమానులతో సరదాగా ముచ్చటించాడు. సాయితేజ్ మాట్లాడుతుండగా..పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా..ఆయన అంతే సరదాగా బధులిచ్చారు.' మీ అభిమానం పొందడం కోసమే ఈ ప్రాంతానికి వచ్చాను. మా గురువు గారు పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడం వల్లే ఆయనతో తెరను పంచుకున్నాను. ఇదొక గొప్ప అనుభూతి.
మాటల్లో నా ఆనందాన్ని చెప్పలేను. ఇప్పుడే ఒకరు మధ్యలో నుంచి లేచి పెళ్లి ఎప్పుడు అంటే? ఇంకెక్కడ పెళ్లి బ్రో.. ఈ సినిమా ముందు వరకూ ఎవరో ఒకరు ట్రై చేసేవారు.
ఇప్పుడంతా బ్రో అని పిలుస్తున్నారు' అని నవ్వులు పూయించారు. అలాగే అభిమానులకు జాగ్రత్తలు సూచించారు. ఆ దేవుడు నాకిచ్చిన సెకెండ్ ఛాన్స్ ఇది. దయచేసి మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి.
ఇందాకే చూసా ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవడం లేదు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. మీకోసం ఇంట్లో వారు ఎదురు చూస్తారు. మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటా' అని అన్నారు. ఇక సినిమా రిలీజ్ వరకూ బ్రో నామ స్మరణ తప్పదు. పైగా పవన్ వాడి వేడి రాజకీయాల నేపథ్యంలో రిలీజ్ అవుతోన్న చిత్రమిది.
ఏపీలో పొలిటికల్ కాక పీక్స్ లో ఉన్న తరుణం ఇది. ఈ నేపథ్యంలో పవన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం సర్వత్రా ఆసక్తి సంతరించుకుంది. ఈ సినిమా రిలీజ్ పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. పవన్ ఇందులో దేవుడి పాత్రలో కనిపించనున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పీకే పాల్గొనే అవకాశం ఉంది.