చాలా సార్లు జీవితాన్ని ముగించాల‌నుకున్నా.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు..

ఒక ప్రత్యేకమైన చాటింగ్ సెష‌న్‌లో MeToo ఆరోపణల తర్వాత తాను అనుభవించిన నరకం గురించి బాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సాజిద్ ఖాన్ (54) మాట్లాడాడు.

Update: 2025-01-02 04:38 GMT

మీటూ ఉద్య‌మ ప‌ర్య‌వ‌సానం చాలామందిపై తీవ్ర ప్ర‌భావం చూపింది. ప‌లువురు న‌టీమ‌ణులు త‌మ‌కు జ‌రిగిన అన్యాయాల్ని బ‌హిర్గ‌తం చేసారు. కొంద‌రు మేల్ స్టార్స్, ద‌ర్శ‌కుల‌పై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. అనంత‌రం ఈ ఆరోప‌ణ‌ల‌పై అధికారికంగా విచార‌ణలు జ‌రిగాయి. కానీ ఇప్పుడు చాలా మంది జైలు బ‌య‌టే ఉన్నారు.

ఒక ప్రత్యేకమైన చాటింగ్ సెష‌న్‌లో MeToo ఆరోపణల తర్వాత తాను అనుభవించిన నరకం గురించి బాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు సాజిద్ ఖాన్ (54) మాట్లాడాడు. ఆరోప‌ణ‌ల‌న్నీ నిజం కాద‌ని క్లీన్ చిట్ ఉన్నప్పటికీ పరిశ్రమ తనను ఎలా కదలకుండా చేసిందో కూడా సాజిద్ ఖాన్ వివ‌రించారు. 2018లో హౌస్‌ఫుల్ 4 షూటింగ్‌లో ఉండగా ప‌లువురు న‌టీమ‌ణులు త‌న‌పై తీవ్రంగా ఆరోపించారు. అది జీవితాన్ని మలుపు తిప్పింది. కేసులు వేసారు. వేధింపుల దావాలతో ఊపిరాడ‌నివ్వ‌లేదు. ఆరోపణల తుఫాన్‌లో సాజిద్ చిక్కుకున్నాడు. దీని ప‌ర్య‌వ‌సానం అతడి కెరీర్ తీవ్రంగా ప్ర‌భావితం అయింది. సాజిద్ పెద్ద ద‌ర్శ‌కుడే అయినా ఓవ‌ర్ నైట్ లో ఖాళీ అయిపోయాడు. చాలామంది ఎగతాళి చేశారు.. దూషించారు. ఆరు సంవత్సరాలపాటు సైలెన్స్ నే ఆశ్ర‌యించాడు. స్వరంలో వణుకు.. మానసికంగా, శారీరకంగా కుంగుబాటుతో కొన్నేళ్లుగా తీవ్ర న‌ష్టం ఎదురైంద‌ని సాజిద్ తెలిపాడు.

గత 6 ఏళ్లలో చాలాసార్లు నా జీవితాన్ని ఆత్మ‌హ‌త్య‌తో ముగించుకోవాలనుకున్నానని సాజిద్ త‌న మాన‌సిక స్థితి గురించి వెల్ల‌డించారు. నేను పని చేయ‌డం లేదు అనేది బ్యాడ్ ఫేజ్‌.. ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (IFTDA) నుండి క్లియరెన్స్ పొందినప్పటికీ నేను తిరిగి కంబ్యాక్ అవ్వ‌డానికి ప్రయత్నించాల్సిన దుస్థితి. సంపాదన లేకపోవడంతో ఇంటిని అమ్మేసి అద్దె ఫ్లాట్‌కి వెళ్లాల్సి వచ్చింది. నేను సంపాదించడం ప్రారంభించినప్పుడు నాకు 14 సంవత్సరాలు.. ఎందుకంటే మా నాన్న (నటుడు, నిర్మాత కం దర్శకుడు కమ్రాన్ ఖాన్) మరణించారు. నేను నా సోద‌రి ఫ‌రాఖాన్ అప్పుల పాలయ్యాం. ఈ రోజు నేను నా పాదాలపై తిరిగి ఎద‌గ‌డానికి ప్రయత్నించడాన్ని చూడటానికి మా అమ్మ సజీవంగా ఉండాలని కోరుకున్నాను. కానీ అమ్మ గ‌త‌ ఏడాది మ‌ర‌ణించారు.. అని తెలిపారు.

నా కెరీర్‌ మొదట్లో హెడ్‌లైన్స్ లో చేర‌డానికి నేను సంచలనాత్మక విషయాలు చెప్పేవాడిని. నేను టీవీ రంగంలో పనిచేసినప్పుడు ప్రజలను అలరించడమే నా పని. నేను చాలా మందిపై తప్పుడు ఆరోప‌ణ‌లు రుద్దేవాడిని... ఈరోజు నా పాత‌ ఇంటర్వ్యూలను చూసినప్పుడు టైమ్ మెషీన్ లో వెన‌క్కి వెళ్లి అవ‌న్నీ ఆపాలని నాకు అనిపిస్తుంది.. అని అన్నారు. నేను త‌ప్పులు గ్రహించినప్పుడల్లా క్షమాపణ చెబుతాను. కానీ పని ఆగిపోయినప్పుడు జీవితాన్ని ప్రశ్నించడం ప్రారంభిస్తాం. నేను మెత్తబడ్డాను. నేను ఇప్పుడు జీవించడానికి పని చేయాలనుకుంటున్నాను.. అని సాజిద్ ఖాన్ తెలిపారు.

Tags:    

Similar News