'సలార్ -2' ముహూర్తం పెట్టేసారా?
జులైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారుట. అంతకు ముందు నిరాడంబరంగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
'సలార్ -2' ముహూర్తం పెట్టేసారా? వేసవి అనంతరం షురూ చేయబోతున్నారా? అందుకోసం ప్రత్యేకమైన సెట్ నిర్మాణం ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే లీకులందుతున్నాయి. 'సలార్-2' చిత్రాన్ని 15 నెలల్లోనే పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని హోంబలే ఫిల్మ్స్ అభిమానులకు మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగానూ ప్రకటించారు. దీంతో మేకర్స్ ఇప్పుడు ఆ మాటను నిలబె ట్టుకునే పనులు మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి 'సలార్ -2' చిత్రాన్ని తొమ్మిది నెలలు గ్యాప్ తీసుకుని తెరకెక్కించాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నారు. కానీ 'సలార్' విజయం చూసిన తర్వాత అంత గ్యాప్ తీసుకోవడం కరెక్ట్ కాదని ముందు గానే పట్టాలెక్కించాలని నిర్ణయం మార్చుకున్నారు. అప్పటి నుంచి ఈ చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు అందుకు ముహూర్తం కుదిరినట్లు కనిపిస్తుంది.
జులైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారుట. అంతకు ముందు నిరాడంబరంగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జులై అంటే అప్పటికి వేసవి కాలం కూడా పూర్తవుతుంది. ఎండల ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా షూటింగ్ కి వెళ్లొచ్చు. ఈ సినిమా షూట్ అంతా సెట్స్ లోనే చేయాల్సి ఉంటుంది. దీంతో సమ్మర్ లో షూటింగ్ అంటే అసాద్యమైన పనే. అందుకే ఇలా అన్నిరకాల వెసులు బాటు చూసుకుని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే స్క్రిప్ట్ పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు సమాచారం. కథలో అవసరమైన కొన్ని మార్పులు చేసినట్లు వినిపిస్తుంది. 'సలార్ సీజ్ ఫైర్' ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. నిజానికి సలార్ 1000 కోట్లు టార్గెట్ గా రిలీజ్ అయింది. కానీ 700 కోట్ల వద్దనే ఆగిపోయింది. సలార్ -2 తో అన్ని లెక్కలు సరిచేయాలని నీల్ అండ్ కో ప్లాన్ చేస్తోంది.