సలార్ సేఫ్ జోన్… ఇంకా ఎంత రావాలంటే?
ఈ సినిమాపై 345 కోట్ల బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. బ్రేక్ ఈవెన్ రావాలంటే 347 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది.
డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం సలార్. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. మొదటి వారం అయితే సాలిడ్ కలెక్షన్స్ ని సలార్ మూవీ అందుకుంది. అయితే సెకండ్ వీక్ నుంచి కొంత వీక్ అయ్యింది.
పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఇతర భాషలలో సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో మూవీ ఆడియన్స్ కి రీచ్ కావడానికి టైం పట్టింది. హిందీలో సలార్ కి పోటీగా డంకీ రిలీజ్ కావడం కూడా అక్కడ కలెక్షన్స్ పరంగా ఎఫక్ట్ పడింది. అలాగే కన్నడంలో అయితే ఉగ్రం మూవీకి రీమేక్ సలార్ అనే టాక్ జనాల్లోకి వెళ్ళడంతో కన్నడ వెర్షన్ సాలా ప్రభావం చూపించలేదు. నిర్మాత, దర్శకుడు కన్నడం వాళ్ళు అయిన పెద్దగా ఆదరించలేద
తమిళనాడు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడ వారి భాషా చిత్రాలకి తప్ప ఇతర భాషల నుంచి ముఖ్యంగా టాలీవుడ్ నుంచి డబ్ అయ్యే సినిమాలకి ప్రాధాన్యత ఇవ్వరు. కేరళలో తెలుగు సినిమాకి మంచి మార్కెట్ ఉంది. కాని సలార్ మూవీ ఎందుకనో అక్కడ క్లిక్ కాలేదు. ఓవరాల్ గా చోసుకుంటే తెలుగు రాష్ట్రాలలో మాత్రమే స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సలార్ అందుకుంది.
ఈ సినిమాపై 345 కోట్ల బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. బ్రేక్ ఈవెన్ రావాలంటే 347 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో 147.75 కోట్ల షేర్ అందుకుంది. కర్ణాటకలో 22.02 కోట్లు, తమిళనాడులో 11.20 కోట్లు, కేరళలో 6.74 కోట్లు, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 71.90 కోట్ల షేర్ వసూళ్లు అయ్యింది. ఓవర్సీస్ లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి 63.60 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
ఓవరాల్ గా 15 రోజుల్లో సలార్ మూవీ 323.21 కోట్ల షేర్ సాధించింది. కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిపోయి లాభాల్లో నడుస్తుంది. మరికొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కి చాలా దూరంలో ఆగిపోయింది. ఓవరాల్ గా చూసుకుంటే సలార్ మూవీ కమర్షియల్ హిట్ గా నిలవాలంటే మరో 23.79 షేర్ సంపాదించాల్సి ఉంది. ఎంత చేసిన ఇంకా వారం రోజులు మాత్రమే సలార్ కి థియేటర్స్ లో స్కోప్ ఉంది. తరువాత ఫెస్టివల్ మూవీస్ రిలీజ్ అవుతాయి. సలార్ థియేటర్స్ నుంచి ఖాళీ అయిపోద్ది.