సలార్ 500 కోట్లు.. ఇంకా ఎంత రావాలంటే..

ఈ నేపథ్యంలో వంద కోట్ల మార్క్ ను ఇండియన్ సినిమాలు అందుకోవడం కామన్ అయిపోయింది

Update: 2023-12-25 13:51 GMT

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. భాష ఏదైనా కంటెంట్ చాలు.. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీంతో ప్రాంతీయ భాషల్లో తెరకెక్కిన సినిమా హద్దులు చెరిపేస్తూ దేశ ఎల్లలు దాటుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వంద కోట్ల మార్క్ ను ఇండియన్ సినిమాలు అందుకోవడం కామన్ అయిపోయింది. రూ.500 కోట్ల మార్క్ కూడా దాటేస్తున్నాయి భారతీయ సినిమాలు.

తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తొలి షో నుంచే హిట్ టాక్ సంపాదించిన ఈ మూవీ.. మూడో రోజుల్లోనే రూ.400 కోట్లకుపైగా వసూళ్ల రాబట్టింది. క్రిస్మస్ సెలవులు కలిసి రావడంతో మరో రోజులోనే రూ.500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టనుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తే ఈ మూవీ నాలుగో రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా అడుగుపెట్టనుందన్నమాట.

అయితే సలార్ కన్నా ముందు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు విడుదల అయిన తక్కువ రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరాయి. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్-2 నాలుగు రోజుల్లోనే రూ.546 కోట్లు వసూలు చేసింది. హోంబలే ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మించింది.

2023లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు రిలీజైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరాయి. పఠాన్ ఐదు రోజుల్లో రూ.542 కోట్ల వసూలు చేయగా.. జవాన్ నాలుగు రోజుల్లో రూ. 520 కోట్లు రాబట్టింది. ఇటీవలే రిలీజైన డంకీ మాత్రం వసూళ్ల పరంగా కాస్త వెనకబడింది.

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సీక్వెల్ బాహుబలి-2 విడుదలైన మూడు రోజుల్లోనే రూ.540 కోట్లు రాబట్టిసేంది. బాహుబలి సినిమాతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ కూడా రిలీజైన మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరింది. మరి ఇప్పుడు ప్రభాస్ సలార్.. ఎన్నిరోజుల్లో రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరుతుందో చూడాలి.

Tags:    

Similar News