15 నెలల్లో `సలార్-2`ని తెచ్చేస్తారా?
సలార్ సీజ్ ఫైర్` భారీ విజయం సాధించడంతో సలార్ -2 కోసం అప్పుడే అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.
సలార్ సీజ్ ఫైర్` భారీ విజయం సాధించడంతో సలార్ -2 కోసం అప్పుడే అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. మొదటి భాగంలోనే స్టోరీ మొత్తం చెప్పేయడంతో పార్ట్ -2 లో ఇక యాక్షన్ మాత్రమే పీక్స్ లో ఉంటుందని అర్దమైపోయింది. వరల్డ్ ఆర్మీతో దేవా అనే ఆర్మీ ఎలా పోరాడింది? ఖాన్సార్ సొంతం చేసుకుని వరదరాజ్ మన్నార్ కి అప్పగిస్తాడా? తానే ఖాన్సార్ కి రాజుగా ప్రకటించుకుంటాడా? వంటి అంశాలు రెండవ భాగంలో ఉంటాయని తేలిపోయింది.
ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందన్నది అర్దమైంది. మొదటి భాగంలో కేవలం ప్రభాస్ ని చూపించారు తప్ప! వార్ జోన్ లోకి ఇంకా దిగలేదు కాబట్టి దిగితే ఎలా ఉంటుందన్నది సలార్-2 లో చూడబోతున్నాం. అంటే యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు. `కేజీఎఫ్` రెండు బాగాల్ని మించి నెక్స్ట్ లెవల్ ప్రభాస్ ని చూపించాలి. మరి ఆ రేంజ్ ప్రభాస్ ని చూపించడానికి 15 నెలలు సమయం సరిపోతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
'సలార్ 2' ని 15 నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు తెస్తామని నిర్మాత విజయ్ కిరగందూర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్ట్ -2 షూటింగ్ అప్ డేట్ ఎంతవరకూ వచ్చిందన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే కొంత శాతం పూర్తి చేసారా? లేక ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాలా? ఒకవేళ మొదలు పెడితే 15 నెలల్లో షూట్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడం అన్నది సాధ్యమేనా అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఎందుకంటే మొదటి భాగం రిలీజ్ కే చాలా సమయం తీసుకున్నారు. ఇప్పుడు రెండవ భాగంలో యాక్షన్ ..ఎలివేషన్ మరింత హైలైట్ చేసి చూపించాలి కాబట్టి ఎక్కువ సమయం పట్టడానికి అవకాశం ఉం టుంది. ఎలా లేదన్నా రెండు సంవత్సరాలు తప్పని సరిగా సమయం పడుతుందని విశ్లేషకుల మాట. మరి నిర్మాత ప్రకటన ఎంతవరకూ సాద్యమవుతుందన్నది చూడాలి.