ఆ స్టార్ హీరోకి 250 కోట్లు పారితోషిక‌మా?

బాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 18కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 17 ఎపిసోడ్లు దిగ్విజ‌యంగా పూర్త‌య్యాయి.

Update: 2024-10-09 03:00 GMT

బాలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 18కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 17 ఎపిసోడ్లు దిగ్విజ‌యంగా పూర్త‌య్యాయి. స‌ల్మాన్ ఖాన్ తో పాటు చాలా మంది హోస్ట్ లుగా ప‌నిచేసారు. కానీ స‌ల్మాన్ చేసిన‌న్ని సీజ‌న్లు ఎవ‌రూ హోస్ట్ చేయ‌లేదు. స‌ల్మాన్ హోస్ట్ చేసిన సీజ‌న్లు బ్లాక్ బ‌స్ట‌ర్ గానూ నిలిచాయి. గ‌త సీజ‌న్ 17 కూడా ఆయ‌నే హోస్ట్ చేసారు. ఈసారి సీజ‌న్ 18కి కూడా స‌ల్మాన్ ఖాన్ కే ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

మ‌రి ఈసారి స‌ల్మాన్ అందుకునే పారితోషికం ఎంత అంటే షాకింగ్ విష‌య‌మే లీకైంది. నెల‌కు 60 కోట్లు చొప్పున ఛార్జ్ చేస్తున్నారుట‌. అంటే 15 వారాల పాటు హోస్ట్ చేస్తే మొత్తంగా స‌ల్మాన్ అందుకునే పారితోషికం 250 కోట్ల‌కు చేరుకుంటారు. నిర్వాహ‌కులే స‌ల్మాన్ డిమాండ్ చేయ‌కుండా అంత మొత్తం ఆఫ‌ర్ చేసిన‌ట్లు వినిపిస్తుంది. ఇదే నిజ‌మైతే బిగ్ బాస్లో ఇదో చ‌రిత్ర‌. బిగ్ బిస్ హిస్ట‌రీలో ఇంత‌వ‌ర‌కూ ఈ రేంజ్ లో పారితోషికం తీసుకోలేదు.

స‌ల్మాన్ ఖాన్ తో పాటు అమీర్ ఖాన్ స‌హా చాలా మంది స్టార్ హీరోలు హోస్ట్ చేసారు. కానీ ఎవరూ నెల ప్రాతి ప‌దిక‌న ఇంత మొత్తంలో ఎవ‌రూ అందుకోలేదు. ఒక‌వేళ ఇదే గ‌నుక నిజ‌మైతే స‌ల్మాన్ బిగ్ బాస్ లో చ‌రిత్ర రాసిన‌ట్లే అవు తుంది. ఇంత‌వ‌ర‌కూ స‌ల్మాన్ హోస్ట్ చేసిన సీజ‌న్లు ఏవీ ఫెయిల‌వ్వ‌లేదు. స‌క్సెస్ పుల్ గా కొన‌సాగాయి మంచి రేటింగ్ వ‌చ్చింది. ఆ ఛానెల్స్ టీఆర్పీ అంత‌కంత‌కు రెట్టింపు అయింది.

ఈ నేప‌థ్యంలోనే నిర్వాహ‌కులు మ‌రోసారి స‌ల్మాన్ ఖాన్ ని తీసుకుంటున్నారు. ఆయ‌న అడ‌గ‌కుండా పారితోషికం సైతం ఆఫ‌ర్ చేసి తీసుకెళ్తున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా వివిధ భాష‌ల్లోనూ బిగ్ బాస్ ర‌న్నింగ్ లో ఉంది. వాటిని స్థానికంగా ఉన్న స్టార్ హీరోలే హోస్ట్ చేస్తున్నారు. స‌ల్మాన్ ఖాన్ మాదిరి టాలీవుడ్ లో బిగ్ బాస్ ని కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న సీజ‌న్ -8ని కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News