ఫ్యాన్స్ సలహా.. ఓకే చెప్పిన సూపర్ స్టార్!
సికిందర్ సినిమా విడుదల తర్వాత సల్మాన్ ఖాన్ అభిమానులతో ముచ్చటించారు. ఆ సమయంలో అభిమానులు పలువురు పలు రకాల సలహాలు ఇచ్చారట.;

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం దక్కడం లేదు. సౌత్ దర్శకులతో బాలీవుడ్ హీరోలు చేసిన కొన్ని సినిమాలు ఈమధ్య కాలంలో సూపర్ హిట్‌గా నిలవడంతో మరగదాస్‌పై నమ్మకం పెట్టి 'సికిందర్' సినిమాను చేశాడు. సల్మాన్ ఖాన్‌ను సికిందర్ సినిమాకు మురగదాస్ ఏ విధంగా ఒప్పించాడు... అసలు సల్మాన్ ఖాన్ ఈ సినిమాకు ఏం నచ్చి ఒప్పుకున్నాడు అంటూ సినిమా చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి సినిమాలకు ఎప్పుడో కాలం చెల్లిందని గుర్తించలేక పోయిన మురగదాస్, సల్మాన్ ఖాన్‌లు మారక పోతే కచ్చితంగా ఇండస్ట్రీలో కొనసాగడం కష్టం అంటూ చాలా మంది రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
రష్మిక బ్యాక్ టు బ్యాక్ యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకి ఆమె సెంటిమెంట్‌గా పని చేస్తుందని సల్లూ భాయ్ భావించి ఉంటాడు. కానీ అది జరగలేదు. సికిందర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. సికిందర్ సినిమా ఫ్లాప్‌ను సల్మాన్ ఖాన్ సైతం ఒప్పుకున్నాడు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను, తప్పకుండా అభిమానుల అంచనాలను అందుకునే విధంగా తన తదుపరి సినిమా ఉంటుంది అని ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు. సికిందర్ సినిమా విడుదల తర్వాత సల్మాన్ ఖాన్ అభిమానులతో ముచ్చటించారు. ఆ సమయంలో అభిమానులు పలువురు పలు రకాల సలహాలు ఇచ్చారట.
ముఖ్యంగా చాలా మంది అభిమానులు గతంలో సల్మాన్ ఖాన్‌తో వర్క్ చేసి సూపర్ హిట్ ఇచ్చిన ఫిల్మ్ మేకర్స్ కబీర్ ఖాన్, అలీ అబ్బాస్ జాఫర్ తో సినిమాలు చేయాలని సూచిస్తున్నారు. గతంలో కమర్షియల్‌గా సక్సెస్‌లు అందుకున్న ఫిల్మ్ మేకర్స్‌తో మరోసారి వర్క్ చేయడం ద్వారా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని, అంతే కాకుండా జోనర్ సైతం కాస్త జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి అంటూ వారు సల్మాన్ ఖాన్‌కి సూచించారట. అందుకు సల్మాన్ ఖాన్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట. ముఖ్యంగా ఫ్యాన్స్ సూచించినట్లు గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకులతో సినిమాలను చేసేందుకు సల్లూ భాయ్ ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'గంగా రామ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు టైటిల్‌ను అధికారికంగా ప్రకటించలేదు. షూటింగ్ సైతం సైలెంట్‌గా చేస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్‌తో కలిసి సల్మాన్ ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. వీరిద్దరు గతంలో నటించిన విషయం తెల్సిందే. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సినిమా ఫలితంపై ఎప్పటిలాగే చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. గంగా రామ్ సినిమా అయినా సల్మాన్ ఖాన్‌కి హిట్ తెచ్చి పెడుతుందా అనేది చూడాలి. సల్మాన్ ఖాన్ గతంలో మాదిరిగా ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేయాలని అభిమానులు కోరుతున్నారు. అందుకు సల్మాన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.