నా సినిమా బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల ఆగిపోయింది - సూపర్ స్టార్
బాలీవుడ్ యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్ కొన్నాళ్లుగా సరైన హిట్లు లేక సతమతమవుతున్నాడు. ఒకప్పుడు సూపర్ హిట్లతో దూసుకెళ్లిన సల్మాన్ ఖాన్ కోవిడ్ తర్వాత ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అవుతూ వచ్చాడు.;

బాలీవుడ్ యాక్షన్ హీరో సల్మాన్ ఖాన్ కొన్నాళ్లుగా సరైన హిట్లు లేక సతమతమవుతున్నాడు. ఒకప్పుడు సూపర్ హిట్లతో దూసుకెళ్లిన సల్మాన్ ఖాన్ కోవిడ్ తర్వాత ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అవుతూ వచ్చాడు. అయినా సరే తన ప్రయత్నాలు ఆపడం లేదు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తమిళ దర్శకుడు మురుగదాస్ తో సికందర్ సినిమా పూర్తి చేశాడు. మరో 3 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. నేషనల్ క్రష్ రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ అసలైతే సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయాల్సి ఉంది. దాదాపు సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే అన్నంత ఊపు చేసిన ఈ ప్రాజెక్ట్ అటకెక్కేసింది. సల్మాన్ ఖాన్, అట్లీ సినిమా ఆగిపోవడం వెనుక రీజన్స్ ఏంటన్నది ఎవరికీ తెలియదు. ఐతే సికందర్ ప్రమోషన్స్ లో సల్మాన్ ఖాన్ ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆ సినిమాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించాం కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఆ సినిమా ఆగిందని అన్నారు సల్మాన్ ఖాన్.
ఐతే అట్లీతో సినిమా మిస్ అయినా కూడా మరో సౌత్ డైరెక్టర్ తో సల్మాన్ సినిమా లాక్ చేసుకున్నాడు. లాస్ట్ ఇయర్ అమరన్ తో సూపర్ హిట్ అందుకున్న రాజ్ కుమార్ పెరియసామి తో సల్మాన్ ఖాన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్ లో తెరకెక్కించబోతున్నారు. అమరన్ తో ఒక సోల్జర్ కథతో ప్రేక్షకులను కట్టిపడేసిన రాజ్ కుమార్ సల్మాన్ భాయ్ తో ఎలాంటి సినిమా చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
అట్లీ మిస్ అయ్యాడని ఫీల్ అవుతున్న సల్మాన్ ఫ్యాన్స్ ఆ ప్లేస్ లో మరో సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ఫిక్స్ అయినందుకు హ్యాపీగా ఉన్నారు. తప్పకుండా ఈ కాంబో సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తున్న సౌత్ డైరెక్టర్స్ మీద బాలీవుడ్ హీరోల దృష్టి పడింది. అందుకే ఇక్కడ దర్శకులతోనే సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇక మురుగదాస్ సికందర్ మీద సల్మాన్ ఖాన్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈమధ్య బాలీవుడ్ లో రష్మిక చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి కాబట్టి సల్మాన్ ఖాన్ సికందర్ కి కూడా అమ్మడి లక్ కలిసి వస్తుందేమో చూడాలి.