ఆ స్టార్ హీరో అభిమానుల్ని మోసం చేసాడా?
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మురగదాస్ తెరకెక్కించిన 'సికిందర్' రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది.;

భారీ యాక్షన్ సన్నివేశాల విషయంలో హీరోలకు డూప్ నటించడం అన్నది సర్వ సాధారణం. రిస్క్ తీసుకోవడానికి హీరోలు ముందుకు రాని సమయంలో డైరెక్టర్లు ఇలా డూప్ తో షూట్ చేస్తుంటారు. ఏ ఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కష్ఠం కొంచెం తగ్గింది. హీరోలకు బాడీ డబుల్ బాగా వినియోగంలోకి వచ్చింది. దీంతో సెట్స్లో హీరోలు లేకపోయినా పనైపోతుంది. అయితే ఇదంతా అవసరం మేర మాత్రమే దర్శకుడు తీసుకోవాలి. అనవసరం తీసుకుంటే సన్నివేశం ఇలాగే ఉంటుంది.
సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా మురగదాస్ తెరకెక్కించిన 'సికిందర్' రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. బాక్సాపీస్ వద్ద ములుగుతుందా? తేలుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరికీ ఈ సినిమా విజయం కీలకమే. ముఖ్యంగా మురగదాస్కి అత్యంత అవసరం. కానీ ఫలితం చూస్తుంటే వాళ్లు అనుకున్నది జరిగిలేలా లేదు. తాజాగా సినిమాపై కొత్త నెగిటివిటీ తెరపైకి వస్తోంది.
సినిమాను సల్మాన్ ఖాన్ లేకుండా షూటింగ్ చేసాడు? అనే ఆరోపణ వ్యక్తమవుతుంది. బాడీ డబుల్ టెక్నిక్ వాడి సల్మాన్ లేకుండానే 70 శాతం షూటింగ్ చేసారని సినిమా చూసిన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వేరొకరి శరీరంపై సల్మాన్ ముఖాన్ని అతికించి ఏ ఐ టెక్నాలజీ తో చాలా సన్నివేశాలు షూట్ చేసారంటు న్నారు. సినిమాలో ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
హీరో-దర్శకుడు ఇద్దరు కలిసి ప్రేక్షకాభిమానుల్ని కొత్త తరహా మోసం చేసారని ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ సన్నివేశాల కోసం కూడా బాడీ డబుల్ టెక్నాలజీ వాడటం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆరోపణలపై మురగదాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి. సాధారణంగా ఏ డైరెక్టర్ ఇలాంటి ఛాన్స్ తీసుకో వడానికి రెడీగా ఉండరు. హీరో అందుబాటులో లేకపోతేనే తప్పని పరిస్థితుల్లో ఆ ఛాన్స్ తీసుకుంటారు. రెగ్యులర్ సన్నివేశాల విషయంలో కూడా ఇలాంటి ఆరోపణ తెరపైకి వస్తుందంటే? తప్పిందం సల్మాన్ వైపు ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి.