స్టార్ హీరో కి ఒక అట్లీ కావాల్సిందే..!
ఐతే సల్మాన్ ఖాన్ కి ఒక సూపర్ హిట్ సినిమా ఇచ్చే డైరెక్టర్ కావాలి. ఈమధ్య బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా సౌత్ దర్శకుల మీద ఫోకస్ పెడుతున్నారు.;

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈమధ్యనే సికందర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏ.ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో రాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేకపోయింది. సల్మాన్ ఖాన్ సికందర్ సినిమా విషయంలో లెక్క తప్పింది. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించినా లాభం లేకుండా పోయింది.
ఈమధ్య సల్మాన్ ఖాన్ సినిమాలు ఏవి బాక్సాఫీస్ దగ్గర వర్క్ అవుట్ కావట్లేదు. రెండేళ్ల క్రితం కిసి క భాయ్ కిసి కి జాన్ తో పాటుగా టైగర్ 3 సినిమా కూడా చేశాడు. ఐతే ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఐతే మధ్యలో సల్మాన్ కేమియో చేసిన పఠాన్ హిట్ కాగా లాస్ట్ ఇయర్ బేబీ జాన్ లో క్యామియో చేయగా వర్క్ అవుట్ కాలేదు.
ఐతే సల్మాన్ ఖాన్ కి ఒక సూపర్ హిట్ సినిమా ఇచ్చే డైరెక్టర్ కావాలి. ఈమధ్య బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా సౌత్ దర్శకుల మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో సల్మాన్ నెక్స్ట్ సినిమా అసలైతే అట్లీ చేయాల్సి ఉంది కానీ అది ఎందుకో కుదరలేదు. షారుఖ్ ఖాన్ కి జవాన్ తో సూపర్ హిట్ ఇచ్చిన అట్లీ సల్మాన్ తో సినిమా చేయాలని అనుకోగా అది కాస్త మిస్ అయ్యింది.
సినిమా బడ్జెట్ ఇంకా మిగతా విషయాలు కుదరకనే సినిమా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. సల్మాన్ కి అట్లీ సినిమా మిస్ అయ్యింది. అట్లీతో సూపర్ హిట్ కొడతాడని అనుకున్న సల్మాన్ ఖాన్ ఎందుకో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అట్లీ మిస్ అయినా మరో సౌత్ డైరెక్టర్ తో సల్మాన్ సినిమా చేస్తాడా లేదా అదే డైరెక్టర్ ని నెక్స్ట్ సినిమాకైనా లైన్ లో పెడతాడా అన్నది చూడాలి.
షారుఖ్ ఖాన్ కి ఎలాగైతే జవాన్ తో హిట్ ఇచ్చాడో అలాంటి డైరెక్టర్ సల్మాన్ ఖాన్ కి కావాలి. అలాంటి డైరెక్టర్ కోసమే సల్మాన్ ఖాన్ ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు. మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు ఆ సినిమా ఏదవుతుంది అన్నది చూడాలి. సల్మాన్ ఖాన్ తిరిగి ఫాం లోకి వస్తే చూడాలని ఆయన ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సల్మాన్ ఇలా వరుస ఫ్లాపులు ఫేస్ చేయడం మాత్రం ఇబ్బందికరంగానే ఉంది.