పోస్ట‌ర్‌తో హైప్ స‌రిపోదేమో భాయ్!

ఇలాంటి స‌మ‌యంలో ఏ.ఆర్.మురుగదాస్ కు ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చే బాధ్య‌త‌ను ఇచ్చాడు.

Update: 2025-02-18 16:32 GMT

ఖాన్‌ల త్ర‌యంలో స‌ల్మాన్ ఖాన్ ప్ర‌త్యేక‌త గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఆ ముగ్గురిలో వంద‌శాతం క‌మ‌ర్షియ‌ల్ స్క్రిప్టుల్ని ఎంపిక చేసుకుని, భారీ యాక్ష‌న్ సినిమాల‌తో నిరంత‌రం అభిమానుల‌ను అల‌రించే హీరో అత‌డు. భాయ్ సినిమాకి ఆరంభ వ‌సూళ్లకు ఢోఖా ఉండ‌దు. అయితే ఇటీవ‌లి కాలంలో స‌ల్మాన్ కి ఆశించిన విజ‌యం ద‌క్క‌డం లేదు. కొన్ని వ‌రుస ఫ్లాపులు అత‌డిని తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి. ఇలాంటి స‌మ‌యంలో ఏ.ఆర్.మురుగదాస్ కు ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చే బాధ్య‌త‌ను ఇచ్చాడు.

2025 మోస్ట్ అవైటెడ్ యాక్షన్ చిత్రం 'సికందర్'పైనే భాయ్ ఆశ‌ల‌న్నీ. ఈ మూవీ కోసం మురుగ‌దాస్ రెండేళ్లుగా తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. దుర‌దృష్ట‌వ‌శాత్తూ మురుగ‌దాస్ కి కొన్నేళ్లుగా స‌రైన విజ‌యం లేక‌పోవ‌డంతో సికంద‌ర్ కి ఆశించిన బ‌జ్ క‌నిపించ‌లేదు. తాజాగా మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈరోజు నిర్మాత సాజిద్ నదియాద్‌వాలా బ‌ర్త్ డే సంద‌ర్భంగా స‌ల్మాన్ భాయ్, అత‌డి బృందం ప్ర‌త్యేకించి మిడ్ నైట్‌లో శుభాకాంక్షలు తెలిపారు. సాజిద్ కి స‌ల్మాన్ కేక్ తినిపించ‌గా, అంద‌రూ చిరున‌వ్వులు చిందిస్తూ కనిపించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఈ ప్రత్యేక సందర్భంలో సికంద‌ర్ నుంచి సల్మాన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఒకే ఒక్క పోస్ట‌ర్ స‌ల్మాన్ అభిమానుల్లో కిక్కు పెంచింది. ఈ పోస్టర్‌లో భాయ్ తీక్ష‌ణ‌మైన చూపులు ఫ్యాన్స్‌లో ఉన్మాదం పెంచాయి. డార్క్ థీమ్డ్ పోస్ట‌ర్‌లో స‌ల్మాన్ సీరియ‌స్ లుక్‌లో, కత్తిని పట్టుకుని టార్గెట్ ని వెతుకుతూ క‌నిపించాడు. మ‌రో భారీ యాక్ష‌న్ చిత్రానికి ఆరంభ సూచ‌న‌లు ఇవి అని అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. నేపథ్యంలో సంతోష్ నారాయణన్ `సికందర్` సంగీతాన్ని కూడా పోస్ట‌ర్ లాంచ్ కోసం జోడించారు. ఈద్ కానుక‌గా ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా విడుద‌ల చేస్తున్న విష‌యాన్ని పోస్ట‌ర్ లో రివీల్ చేసారు.

పోస్టర్ విడుదలైన తర్వాత అభిమానులు సోష‌ల్ మీడియాలలో `బ్లాక్ బస్టర్ లోడింగ్` అంటూ ఉత్సాహంగా క‌నిపించారు. సాజిద్ న‌డియాద్వాలా గ్రాండ్సన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇలాంటి పోస్టర్‌ను షేర్ చేశారు. ఓపిగ్గా వేచి చూస్తున్న అభిమానుల‌కు ఈ పోస్ట‌ర్ ఒక చిన్న కానుక మాత్ర‌మే.. అస‌లు ట్రీట్ ముందుంది! అని న‌డియాద్వాలా ఇన్ స్టాలో ఉద్వేగంగా స్పందించారు. ఫిబ్రవరి 27న ఒక పెద్ద స‌ర్ ప్రైజ్ ఉంటుంద‌ని కూడా టీజ్ చేయ‌డం మ‌రింత‌ ఉత్సాహం పెంచింది. స‌ల్మాన్ క‌సి తీరేంత పెద్ద విజ‌యాన్ని మురుగ‌దాస్ అందించాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News