ఆ స్టార్ హీరో రోజుకి రెండు గంట‌లే నిద్ర‌పోతాడా!

ఎనిమిది గంట‌లు సాధ్యం కాన‌ప్పుడు క‌నీసం ఆరు గంట‌లైనా నిద్ర‌పోవాల‌ని డాక్ట‌ర్లు ఎప్పుడూ గ‌ట్టిగా చెప్పే మాట‌

Update: 2025-02-10 03:53 GMT

రోజులో త‌ప్ప‌ని స‌రిగా ఆరు నుంచి ఎనిమిది గంట‌లు నిద్ర త‌ప్ప‌నిస‌రి. ఎనిమిది గంట‌లు సాధ్యం కాన‌ప్పుడు క‌నీసం ఆరు గంట‌లైనా నిద్ర‌పోవాల‌ని డాక్ట‌ర్లు ఎప్పుడూ గ‌ట్టిగా చెప్పే మాట‌. కానీ ఇలాంటి మాట‌లు రాంగోపాల్ వ‌ర్మ‌కు..స‌ల్మాన్ ఖాన్ కు అంత‌గా న‌చ్చ‌వేమో. ఏ ప‌ని పాటు లేని వాళ్లే త‌ప్ప‌నిస‌రిగా ఎనిమిది గంట‌లు నిద్ర‌పోతారని రాంగోపాల్ వ‌ర్మ ఎప్ప‌టికప్పుడు సెటైర్లు వేస్తుంటారు. వ‌ర్మ కూడా ప‌డుకునే స‌మ‌యం చాలా త‌క్కువ‌గా ఉంటుందన్నాడు.

ప‌గ‌లు అస‌లు ప‌డుకోడు. రాత్రి పూట ఎప్పుడోమిడ్ నైట్ త‌ర్వాత ప‌డుకుంటాడు. అదీ కూడా చాలా త‌క్కువ గంట‌లే. మ‌హా అయితే ఆయ‌న నిద్ర ఐదు గంట‌ల లోపే ఉంటుంది. తాను నిరంత‌రం ఏదో ప‌ని చేస్తూనే ఉంటాన‌ని..ఖాళీగా మాత్రం ఉండ‌న‌ని చెబుతుంటారు. ఎక్కువ‌గా పుస్త‌కాలు...సినిమాలు...పోర్న్ వీడియోలు చూస్తూ బిజీగా ఉంటాన‌న్నారు. తాజాగా స‌ల్మాన్ ఖాన్ కూడా రోజులో రెండు గంట‌లు మాత్ర‌మే నిద్ర‌పోతారుట‌ట‌.

నెల‌లో అయితే కేవ‌లం రెండు..లేదా మూడు సార్లు మాత్రమే ఏడు నుంచి ఎనిమిది గంట‌లు ప‌డుకుంటారుట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా స‌ల్మాన్ ఖాన్ చెప్పారు.అలాగ‌ని రాంగోపాల్ వ‌ర్మ‌లా ఈయ‌న‌కి వేరే వ్యాపకాలు ఏమీలేవు. ఓపాడ్ కాస్ట్ లో ఈ విష‌యంతో పాటు కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాలు స‌ల్మాన్ రివీల్ చేసారు. స‌మ‌యం దొరికితే సెట్స్ లో కూడా ప‌డుకుంటారుట‌. షూటింగ్ మ‌ధ్య‌లో బ్రేక్ దొరికితే కుర్చీలో నే కునుకు లాగుతారుట‌.

ఆ నిద్ర కూడా ఏం ప‌నిలేదు అనుకుంటేనే వ‌స్తుందిట‌. కృష్ణ జింక‌ల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న‌ప్పుడు మాత్రం ఎక్కువ‌గా ప‌డుకునే వారుట‌. ఏం చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో అలా చేసేవాడిన‌న్నారు. ప‌ని ఉంటే మాత్రం నిరంత‌ర ప‌నిధ్యాశ‌తోనే ఉంటాడుట‌. కుటుంబానికి, స్నేహితుల‌కు ఎప్పుడూ అందుబాటు లో ఉండాల‌ని సూచించార‌.

Tags:    

Similar News