2 కోట్లు ఇవ్వు.. లేదంటే..! స్టార్ హీరోకి బెదిరింపు!!

తాజాగా రూ. 2 కోట్లు ఇవ్వ‌క‌పోతే స‌ల్మాన్ ని చంపేస్తామంటూ బెదిరించిన వ్యక్తి ఎవ‌రు అనేది ఇంకా పోలీసులు గుర్తించలేదు.

Update: 2024-10-30 08:13 GMT

కొద్ది రోజుల క్రితం ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్‌కు సల్మాన్ ఖాన్‌కు ప్రాణహాని ఉందంటూ మెసేజ్ వచ్చింది. ఈ సందేశంలో దుండ‌గులు రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. అయితే ఈ మెసేజ్ పంపిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. జంషెడ్‌పూర్‌కు చెందిన కూరగాయల విక్రయదారుడు షేక్ హుస్సేన్ షేక్ మౌసిన్ (24) ని నిందితుడిగా గుర్తించారు. ఆ ఘ‌ట‌న జ‌రిగిన కొద్ది రోజులకే మ‌రో బెదిరింపు. ఈసారి రూ. 2 కోట్లు చెల్లిస్తే ఈ గొడ‌వ నుంచి విమోచ‌నం ల‌భిస్తుందని బెదిరింపు సందేశం వచ్చింది. శుక్రవారం రాత్రి ఖాన్ & జీషన్ సిద్ధిక్ (స‌ల్మాన్ స్నేహితుడు, హ‌తుడు బాబా సిద్ధిఖ్ కుమారుడు) లను బెదిరించినందుకు మహ్మద్ తయ్యబ్, అలియాస్ గుర్ఫాన్ ను నోయిడాలో అరెస్టు చేసిన‌ ఒక రోజు తర్వాత ఇది జరిగింది. బాబా సిద్ధిక్ హత్య తర్వాత బెదిరింపులు మరింత పెరిగాయి. సల్మాన్ అభిమానులు దీనిపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

తాజాగా రూ. 2 కోట్లు ఇవ్వ‌క‌పోతే స‌ల్మాన్ ని చంపేస్తామంటూ బెదిరించిన వ్యక్తి ఎవ‌రు అనేది ఇంకా పోలీసులు గుర్తించలేదు. ఇండియా టుడే క‌థ‌నం ప్రకారం... విమోచనం కావాలంటే డ‌బ్బు చెల్లించాలి.. లేక‌పోతే సల్మాన్‌ను చంపేస్తామ‌ని సందేశం (మెసేజ్) లో ఉంది. వర్లీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 354(2) మరియు 308(4) కింద కేసు నమోదు చేశారు.

గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ ప‌లుమార్లు సల్మాన్ ని చంపేస్తామంటూ బెదిరించాడు. స‌ల్మాన్ స్నేహితుడు బాబా సిద్ధిక్ హత్యతో స‌ల్మాన్ ని మ‌రోసారి తీవ్రంగా హెచ్చ‌రించాడు. `హమ్ సాథ్ సాథ్ హై` షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లో కృష్ణజింకను వేటాడినట్లు సల్మాన్‌పై ఆరోపణలు రావడంతో ఈ గొడవ మొదలైంది. బిష్ణోయ్ కమ్యూనిటీ సభ్యులు స‌ల్మాన్ చేసిన పనికి త‌మ ఆల‌యానికి వ‌చ్చి క్షమాపణ చెప్పాలని కోరారు. కానీ సల్మాన్ ఎప్పుడూ కనిపించకపోవడంతో ఖాన్‌ను చంపేందుకు బిష్ణోయ్ క‌మ్యూనిటీ యువ‌కుడైన ధైర్య‌వంతుడు లారెన్స్ బాధ్యత వహించాడు. లారెన్స్ కజిన్ రమేష్ బిష్ణోయ్ ఇటీవల దీనిపై ఎన్డీటీవీతో మాట్లాడుతూ, ``సల్మాన్ ఖాన్ కృష్ణ జింక‌ను చంపిన‌ప్పుడు ప్రతి బిష్ణోయ్ రక్తం మరిగింది.. కానీ మేము దానిని కోర్టుకు వదిలివేస్తాము. అయితే ఈ రోజు సమాజం మొత్తం లారెన్స్ కు అండ‌గా ఉంది. వారికి న్యాయం కావాలి.. డబ్బు కాదు. సల్మాన్ - సలీం ఖాన్ ఇద్ద‌రూ బిష్ణోయ్ కమ్యూనిటీకి ఖాళీ చెక్కును అందించారని, అయితే వారు దానిని తీసుకోవడానికి నిరాకరించారని చెప్పాడు.

Tags:    

Similar News