ఆ సూప‌ర్ హిట్ ప్రాంచైజీ నుంచి - 4వ భాగం!

ఇక 'ద‌బాంగ్' 41 కోట్ల‌లో అభిన‌వ్ సింగ్ క‌శ్య‌ప్ తెర‌కెక్కించ‌గా 220 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. ప్ర‌భుదేవా తెర‌కెక్కించిన భాగ‌మే వ‌సూళ్లు త‌క్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

Update: 2024-03-31 12:30 GMT

స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సూప‌ర్ హిట్ ప్రాంచైజీ 'ద‌బాంగ్' స‌క్సెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన మూడు భాగాలు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. అభిన‌వ్ సింగ్ క‌శ్య‌న్..ఆర్బాజ్ ఖాన్..ప్ర‌భుదేవా ఒక‌రికొక‌రు పోటీగా భాయ్ తో ఈ సినిమాలు తెర‌కెక్కించి భారీ విజ‌యాలు అందించారు. స‌ల్మాన్ కెరీర్ లోనే 'ద‌బాంగ్' ఓ మైల్ స్టోన్ ప్రాంచైజీ అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. యాక్ష‌న్ ప్యాక్డ్ ఎంట‌ర్ టైన‌ర్ కి ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. 'ద‌బాంగ్ -3' త‌ర్వాత 'ద‌బాంగ్ -4' వ‌స్తుంద‌ని ప్ర‌చారం సాగింది గానీ ఇంత‌వ‌కూ ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు.

తాజ‌గా ఆ విష‌యాల్ని సల్మాన్ ఖాన్ రివీల్ చేస్తూ 'ద‌బాంగ్ -4'కి రెడీ అవుతున్న‌ట్లు తెలిపారు. అతి త్వ‌ర‌లోనే 'ద‌బాంగ్ -4' రాబోతుందంటూ ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఈ స్క్రిప్ట్ ప‌నుల్లోనే తాను..ఆర్బాజ్ ఖాన్ బిజీగా ఉన్న‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే క‌థ సిద్దం అవుతుంద‌న్నారు. కానీ ఎప్పుడు ప్రారంభించాలి? అన్న దానిపై ఇంకా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్ప‌లేదు. దీంతో నాల్గ‌వ భాగానికి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది మాత్రం క‌న్ప‌మ్ అయింది.

కొత్త ద‌ర్శ‌కుడి తెర‌పైకి తేకుండా సోద‌రుడు ఆర్బాజ్ ఖాన్ కే స‌ల్మాన్ ఆ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పాడు. ఎలాగూ సొంత నిర్మాణ సంస్థ సినిమా కాబ‌ట్టి మేక‌ర గాను బ్ర‌ద‌ర్ అయితే బాగుంటుంద‌ని భాయ్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 'ద‌బాంగ్ -2' ఆర్బాజ్ ఖాన్ తెర‌కెక్కించాడు. 50 కోట్ల‌లో నిర్మించిన సినిమా 250 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది.' ద‌బాంగ్ -3'ని ప్ర‌భుదేవా 100 కోట్ల‌తో నిర్మించ‌గా 230 కోట్ల వ‌సూళ్లు సాధించింది.

ఇక 'ద‌బాంగ్' 41 కోట్ల‌లో అభిన‌వ్ సింగ్ క‌శ్య‌ప్ తెర‌కెక్కించ‌గా 220 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. ప్ర‌భుదేవా తెర‌కెక్కించిన భాగ‌మే వ‌సూళ్లు త‌క్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అభిన‌య్..ఆర్బాజ్ మాత్రం ఇద్ద‌రు త‌క్కువ బ‌డ్జెట్ లోనే ఆ రేంజ్ వ‌సూళ్ల‌ను సాధించ‌డం వివేషం. స‌ల్మాన్ ఖాన్' టైగ‌ర్ -3' రిలీజ్ త‌ర్వాత కొత్త సినిమాకి క‌మిట్ అవ్వ‌లేదు. ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలోకి రాలేదు. ఈనేప‌థ్యంలో ద‌బాంగ్-4 తెర‌పైకి రావ‌డం విశేషం.

Tags:    

Similar News