సమంత సాహసం.. ఫైనల్ గా క్లిక్కయ్యింది
‘ది ఫ్యామిలీ మెన్ 2’ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసిన సమంత ఈ సారి ‘సిటాడెల్’ లో సూపర్ స్పై గా అదరగొట్టింది.
సౌత్ ఇండియన స్టార్ హీరోయిన్ సమంత తన ఇమేజ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్లే పనిలో బిజీగా ఉన్నట్లు అనిపిస్తోంది. సినిమా, వెబ్ సిరీస్ లు అని చూడకుండా యాక్షన్ క్వీన్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన బలమైన కంటెంట్ లని ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తోంది. ‘ది ఫ్యామిలీ మెన్ 2’ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసిన సమంత ఈ సారి ‘సిటాడెల్’ లో సూపర్ స్పై గా అదరగొట్టింది.
తాజాగా ‘సిటాడెల్: హాన్నీ బన్నీ’ వెబ్ సిరీస్ అమెజాన్ లో రిలీజ్ అయ్యింది. దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో సమంత యాక్షన్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు. కొన్ని బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించి సమంత అందరికి షాక్ ఇచ్చింది. ఆమె పెర్ఫార్మెన్స్ కి విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. స్పై క్యారెక్టర్ లో ఓ వైపు యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టిందని, మరో వైపు మదర్ గా ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో కూడా మెప్పించిందని అంటున్నారు.
ఈ సిరీస్ ఆమెకి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకురావడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ‘సిటాడెల్’ తో సమంత రేంజ్ పెరిగిపోయిందని భావిస్తున్నారు. ఇకపై ఆమెను దృష్టిలో ఉంచుకొని చాలా మంది కథలు రాసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్ ప్రమోషన్స్ లో సమంత చాలా యాక్టివ్ గా పాల్గొంది. సోషల్ మీడియాలో కూడా సమంత యాక్టివ్ గా ఉంటుంది.
ఫ్యాన్స్ తో లైవ్ లో అప్పుడప్పుడు ముచ్చటిస్తుంది. ‘సిటాడెల్’ రిలీజ్ నేపథ్యంలో ఫ్యాన్స్ తో లైవ్ టాక్ లో ఆమె ఇన్ స్టాగ్రామ్ ద్వారా కనెక్ట్ అయ్యింది. ఇందులో ఒక అభిమాని సమంతకి కాస్తా బరువు పెరగాలని రిక్వెస్ట్ చేశాడు. దీనిపై సమంత కాస్తా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. 'మరోసారి బరువు గురించి ప్రశ్న. మాయోసైటిస్ తర్వాత హెల్త్ కండిషన్ ను దృష్టిలో ఉంచుకొని డాక్టర్స్ సూచనల మేరకు నేను కఠినమైన డైట్ ఫాలో అవుతున్నాను.
అందుకే నేను ఇలా ఉన్నాను. నా ఆరోగ్య సమస్యని దృష్టిలో ఉంచుకొని నేను ఇదే వెయిట్ లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను. మరో సారి ఇలాంటి బాడీ షేమింగ్ ప్రశ్నలు వేయకండి. మనం ఇప్పుడు 2024లో ఉన్నాం' అంటూ సమంత రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమంత హిందీలో ‘రక్త బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సిరీస్ షూటింగ్ దశలో ఉంది.