సెకండ్ హ్యాండ్ అన్నారు.. ఎంతో బాధపడ్డా: సామ్

స్టార్ హీరోయిన్ సమంత.. కొద్దిరోజులుగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-11-26 07:44 GMT

స్టార్ హీరోయిన్ సమంత.. కొద్దిరోజులుగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. తన జీవితంలో జరిగిన అనేక విషయాలపై తరచుగా స్పందిస్తున్నారు. విడాకులు తీసుకోవడం.. మయోసైటిస్ బారినపడటం.. వంటి క్లిష్టమైన పరిస్థితుల కోసం సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. తాజాగా మరో ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు సామ్.

విడాకుల సమయంలో తనకు సంబంధించిన ఎన్నో అవాస్తవాలు చాలామంది ప్రచారం చేశారని సమంత ఆవేదన వ్యక్తం చేశారు. అవి అబద్ధాలు కాబట్టి వాటి గురించి ఎప్పుడూ మాట్లాడాలని అనుకోలేదని తెలిపారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కొందరు స్నేహితులు, కుటుంబ సభ్యులు మంచి మద్దతు పలికారని చెప్పారు.

విడాకుల సమయంలో తాను చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నానని తెలిపారు. ఓ ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేక్ అయితే అనేక మంది అమ్మాయిలనే నిందిస్తారని బాధపడ్డారు. మనం అలాంటి సమాజంలో బతుకుతున్నామని చెప్పారు. ముఖ్యంగా విడాకుల అయిన తర్వాత అమ్మాయిలకు సొసైటీ కొన్ని ట్యాగ్స్ తగిలిస్తుందని సమంత వ్యాఖ్యానించారు.

సెకండ్ హ్యాండ్, ఆమె జీవితం వేస్ట్, యూజ్డ్ అని అంటారని తెలిపారు. అలా ఎందుకు చేస్తారో తనకు ఇప్పటికే కావడం లేదని అన్నారు. అలాంటి మాటలు సదరు అమ్మాయి, వాళ్ల ఫ్యామిలీని ఎంతో బాధపడేలా చేస్తాయని చెప్పారు. ఆ తర్వాత తన పెళ్లి గౌను రీమోడల్ చేయించిన విషయంపై మాట్లాడారు. ఆ సమయంలో చాలా బాధపడినట్లు తెలిపారు.

మ్యారేజ్ గౌను రీడిజైన్ చేయించి.. తాను రివెంజ్ తీర్చుకోవాలని అనుకోలేదని తెలిపారు సమంత. లైఫ్ లో జరిగిన విషయాలు దాచుకోవాలని అనుకోవడం లేదని చెప్పారు. ఎన్నో కష్టమైన స్టేజీలు దాటుకుని ఇక్కడి వరకు వచ్చానని పేర్కొన్నారు. అది తన స్ట్రెంత్ కు ఒక నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నట్లు వెల్లడించారు.

అదే సమయంలో ఇటీవల వచ్చిన సిటాడెల్ షూటింగ్ లో తాను అనేక సవాళ్లు ఎదుర్కొన్నట్లు తెలిపారు. డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే.. యాక్షన్ సీన్స్ కోసం చెప్పినప్పుడు తాను ఒప్పుకోలేదని చెప్పారు. మయోసైటిస్ కారణంగా చేయలేనని చెప్పినట్లు గుర్తు చేశారు. తనను కాకుండా వేరే హీరోయిన్ ను తీసుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు. కానీ సామ్.. తన టాలెంట్ తో సిటాడెల్ సిరీస్ లో అందరినీ మెప్పించారు. ప్రస్తుతం సామ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Tags:    

Similar News