సక్సెస్‌కు కొత్త అర్ఠం చెప్పిన సమంత
ఈ పర్యటనలో భాగంగా సమంత తన కెరీర్ గురించి మాట్లాడటంతో పాటూ సక్సెస్ కు కొత్త అర్థాన్ని కూడా తెలియ చెప్పింది.;

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. మధ్యలో మయోసైటిస్ సమస్యతో బాధ పడి, దాని ట్రీట్‌మెంట్ కోసం సినిమాల నుంచి గ్యాప్ తీసుకుని ఆ సమస్యను అధిగమించింది. ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి వచ్చి తన సత్తా చాటాలని చూస్తున్న సమంత రీసెంట్ గా సిడ్నీలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా సమంత తన కెరీర్ గురించి మాట్లాడటంతో పాటూ సక్సెస్ కు కొత్త అర్థాన్ని కూడా తెలియ చెప్పింది.
సక్సెస్ అవడమంటే విజయాలు సాధించడమే కాదని, సామజిక పరిమితుల నుంచి విముక్తి పొంది, స్వేచ్ఛగా జీవించడమని సమంత ఈ సందర్భంగా పేర్కొంది. మనకు నచ్చినట్టు మనం జీవించడమే సక్సెస్ అని, వేరే వాళ్లు వచ్చి సక్సెస్ అయ్యావని చెప్పే వరకు తాను వెయిట్ చేస్తూ ఉండనని కూడా సమంత చెప్పుకొచ్చింది.
ఆడవారిని ఒకచోట బంధించి ఇది చేయాలి, ఇలానే చేయాలి, అది చేయకూడదని అని చెప్పడం కరెక్ట్ కాదని, రియల్ లైఫ్ లో ఎన్నో రకాల క్యారెక్టర్లను చేస్తూ వాటిని సరిగ్గా ముందుకు తీసుకెళ్లడమే నిజమైన సక్సెస్ అని సమంత తెలిపింది. యూత్ తో మాట్లాడుతూ తాను కన్న కలల్లో ఒకటి ఇప్పటికీ నెరవేరలేదని సమంత చెప్పింది.
తాను చదువుకునే రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్లి, సిడ్నీ యూనివర్సిటీలో చదువుకోవాలని అనుకున్నానని, కానీ ఆ కోరిక తీరలేదని చెప్పిన సమంత అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి, నటిగా ఇంతమంది ప్రేమాభిమానాలు పొందడం ఎంతో ఆనందాన్నిస్తుందని తెలిపింది. ప్రతీ ఒక్కరూ తమ కలల్ని నెరవేర్చుకునే దిశగా అడుగులేయాలని సమంత ఈ సందర్భంగా యువతకు సూచించింది.
కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ, ఆడియన్స్ కు మంచి కథలను అందించడానికే తాను నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినట్టు సమంత వెల్లడించింది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ సినిమా చేస్తున్న సమంత, ఆ సినిమా కోసం యాక్షన్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు తెలిపింది. దీంతో పాటూ సమంత సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం మూవీని ఆల్రెడీ అనౌన్స్ చేసింది. తాను నిర్మిస్తున్న మొదటి సినిమా శుభం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.