సామ్.. ఆ ప్రశంసల ఫలితం రివెంజ్ లాంటిదే!
ఆ విషయంపై రీసెంట్ గా ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో అబద్ధాలు వ్యాప్తి చెందాయని అన్నారు.
స్టార్ హీరోయిన్ సమంత పర్సనల్ లైఫ్ ఎంత డిస్టర్బ్ గా ఉందో అందరికీ తెలిసిందే. హీరో నాగ చైతన్యతో విడాకులు.. ఆ తర్వాత మయోసైటిస్ బారినపడడం.. ఈ రెండు విషయాలతో సామ్ బాగా డిస్టర్బ్ అయ్యారనే చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ తో చాలా బాధపడ్డారు. ఆ విషయాన్ని స్వయంగా ఆమెనే పలు ఇంటర్వ్యూస్ లో తెలిపారు.
2017లో చైతూ, సామ్ వివాహం జరగ్గా.. 2021లో విడిపోయారు. ఆ తర్వాత సమంత చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. విడాకులు పరస్పర అంగీకారంతో తీసుకున్నప్పటికీ.. పలువురు ఆమెనే నిందించారు. అనేక విధాలుగా ట్రోలింగ్ చేశారు. ఆ విషయంపై రీసెంట్ గా ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో అబద్ధాలు వ్యాప్తి చెందాయని అన్నారు.
అవన్నీ నిజం కాదని చాలా సార్లు బయటకు వచ్చి చెప్పాలని అనిపించిందని, కానీ చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని ఆగిపోయానని చెప్పుకొచ్చారు. అలా తన బాధను పంచుకున్నారు. అయితే తన మ్యారేజ్ డ్రెస్ ను రీమోడల్ చేయడానికి కారణం రివెంజ్ తీర్చుకోవడానికి కాదని తెలిపారు. అలా చేయడం చాలా బాధగా కలిగించిందని చెప్పారు.
అయితే విడాకుల తర్వాత సామ్.. నటించిన చిత్రాల్లో ఒకటైన ఖుషి మూవీ టైమ్ లో మయోసైటిస్ బారినపడినట్లు ప్రకటించారు. ఆ వ్యాధితో సామ్ చాలా ఇబ్బందులు పడ్డారు. పూర్తిగా కొన్ని నెలల పాటు మూవీస్ కు దూరమయ్యారు. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. కొన్ని నెలల రెస్ట్ తర్వాత ఇండియాకు తిరిగొచ్చారు. వ్యాధితో ఇబ్బంది పడుతూనే.. సిటాడెల్ వెబ్ సిరీస్ సహా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు.
ఇప్పుడు మళ్ళీ కెరీర్ పరంగా బిజీగా మారుతున్నారు. మంచి అవకాశాలు అందుకుని సత్తా చాటాలని చూస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ఓ రేంజ్ లో మెప్పించారు. సిరీస్ లో నార్మల్ సీన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ ల్లో కూడా అదరగొట్టారు. తన టాలెంట్ ఏంటో గట్టిగా ప్రూవ్ చేసుకున్నారు. హనీ రోల్ లో ఒదిగిపోయి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు.
పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ గా ఉన్నా.. చిన్న గ్యాప్ తర్వాత సామ్ తానేంటో నిరూపించుకున్నారని కొందరు నెటిజన్లు ఇప్పుడు కామెంట్స్ పెడుతున్నారు. తన మార్క్ ను మరోసారి చూపించారని చెబుతున్నారు. మాయోసైటిస్ తీవ్రంగా దెబ్బతీసినా, విడాకుల తర్వాత నిస్పృహకు గురైనా.. కమ్ బ్యాక్ ఇచ్చారని అంటున్నారు. ఇది రివెంజ్ అనుకున్నా.. అనుకోకపోయినా.. ఆమె పొందుతున్న ప్రశంసల ఫలితం అదేనని అభిప్రాయపడుతున్నారు.