టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మలు కనిపించరా?
కొందరు హీరోయిన్స్ సైతం అప్పట్లో హీరోయిన్స్‌గా నటించి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత వారు కూడా కనుమరుగు కానున్నారు.
ఎక్కడ అయినా కొత్త నీరు వస్తుంటే పాత నీరు అనేది వెళ్లి పోతుంది. సినిమా ఇండస్ట్రీలోనూ అదే జరుగుతుంది. దాదాపు వందేళ్లుగా ఎంతో మంది కొత్త వాళ్లు ఎంట్రీ ఇవ్వడం, అదే స్థాయిలో పాత వారు కనుమరుగు కావడం మనం చూస్తూ వస్తున్నాం. కొద్ది మంది మాత్రమే ఇండస్ట్రీలో అలా పాతుకు పోతూ ఉంటారు. కొద్ది మంది హీరోలు నాలుగు అయిదు దశాబ్దాలు అయినా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు. కొందరు హీరోయిన్స్ సైతం అప్పట్లో హీరోయిన్స్‌గా నటించి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత వారు కూడా కనుమరుగు కానున్నారు. అయితే కొద్ది మంది హీరోయిన్స్ మాత్రం ఉన్నట్లుండి కనుమరుగు అవుతున్నారు.
టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్స్‌గా మొన్నటి వరకు వెలుగు వెలిగిన పలువురు హీరోయిన్స్ ఇకపై కనిపించే అవకాశాలు లేవని, ఒకవేళ చేసినా చిన్నా చితక సినిమాల్లో మాత్రమే వారు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సమంత ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. టాలీవుడ్‌లో ఈ అమ్మడు సుదీర్ఘ కాలం పాటు టాప్ స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. ఈమధ్య కాలంలో బాలీవుడ్‌లో వరుసగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తున్న కారణంగా తెలుగులో సినిమాలు చేయడం లేదు. ఒకటి రెండు సినిమా ఆఫర్లు వచ్చినా సమంత వాటిని సున్నితంగా తిరస్కరించిందట. ముందు ముందు సైతం టాలీవుడ్‌లో ఆమె నటించే అవకాశాలు కనిపించడం లేదు.
పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లో సినిమాలు చేయాలని ఆశ పడింది. కానీ కాజల్‌కి టాలీవుడ్‌లో ఆఫర్లు పెద్దగా రావడం లేదు. ఒకటి రెండు సినిమాల్లో నటించిన పెద్దగా అవి వర్కౌట్ కావడం లేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఆమె మెల్ల మెల్లగా దూరం జరుగుతుందని తెలుస్తోంది. చిన్నా చితకా ఆఫర్లు వస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదని తన ఇమేజ్‌కి తగ్గట్లు ఆఫర్లు వస్తేనే నటించేందుకు ఆసక్తిని కనబర్చుతుంది. కనుక కాజల్ అగర్వాల్‌కి టాలీవుడ్‌లో కాలం చెల్లినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నట వారసురాలు శృతి హాసన్ సైతం టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేయడం లేదు. ఆమెకు యంగ్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రావడం లేదు, సీనియర్ హీరోల సినిమాల్లో ఆమె నటించేందుకు ఆఫర్లు దక్కించుకోవడం లేదు. అందుకే శృతి హాసన్ రాబోయే రోజుల్లో టాలీవుడ్ నుంచి కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరు మాత్రమే కాకుండా పలువురు హీరోయిన్స్ సైతం టాలీవుడ్ నుంచి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఉప్పెన సినిమాతో కృతి శెట్టి టాలీవుడ్‌లో అడుగు పెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. కానీ అంతలోనే ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గాయి. ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలు ఏమీ లేవు. కీర్తి సురేష్‌కి తెలుగులో పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఈమె సైతం మెల్ల మెల్లగా టాలీవుడ్‌కి దూరం అయ్యేలా ఉంది. పూజా హెగ్డే సైతం కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా నిలిచింది. కానీ టాలీవుడ్‌లో ఈమె పరిస్థితి బాగాలేదు. ఈమెకు టాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, రెజీనా ఇంకా ఇతర హీరోయిన్స్ సైతం ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు.