ఆ మూడు రోజులు నాకు నేనే తోడు: సమంత
తోడు లేని ఒంటరి జీవితంలో ఆవేదన గురించి సమంత రూత్ ప్రభు నిజాయితీగా మాట్లాడుతుంది.
తోడు లేని ఒంటరి జీవితంలో ఆవేదన గురించి సమంత రూత్ ప్రభు నిజాయితీగా మాట్లాడుతుంది. ఒంటరితనం అలవాటైపోయిన వ్యాపకం ఇప్పుడు. ఇలాంటి సమయంలో తమిళనాడు కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ లో ధ్యానం, యోగ సాధనతో కొంత ఉపశమనం పొందింది సామ్. సద్గురు వద్ద సాధన చేస్తున్న ఫోటోలు, వీడియోలు కూడా ఇంతకుముందు సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యాయి.
అంతే కాదు ఆధ్యాత్మికత అంటే అనవసరమైన డిస్ట్రబెన్స్ లేకుండా గడపడం. సమంత గురువు సన్నిధానంలో మూడు రోజులు మౌనంగా ఉంది. ``ఫోన్ లేదు.. కమ్యూనికేషన్ లేదు.. నాకు నేను మాత్రమే తోడుగా ఉన్నాను`` అని కూడా సమంత వెల్లడించింది. ఏదో ఒక కారణంతో ఒంటరిగా ఉండటం భయానకమైన విషయం. నేను మళ్ళీ దీని నుంచి బయటపడతానా? అంటే.. మిలియన్ సార్లు .. మొబైల్ లేకుండా ఒంటరిగా ప్రయత్నించమని నేను సిఫార్సు చేస్తాను.. లక్షల సార్లు చెబుతాను`` అని సమంత అంది. ఒంటరితనం భయపెట్టేదిగా ఉంటుందని కూడా సమంత అంగీకరించింది. మళ్లీ మళ్లీ దీనిని ఇష్టంగా ఎదుర్కొంటానని అంది.
సమంత అప్స్ అండ్ డౌన్స్ గురించి.. తన శారీరక, మానసిక ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఎప్పుడూ వెనకాడదు. నాగచైతన్యతో ప్రేమ పెళ్లి, విడాకులు, ఆ తర్వాత ఆటో ఇమ్యూన్ వ్యాధి, మయోసిటిస్ తో సమస్యలు ఎన్ని ఉన్నా అన్నిటినీ ఎదుర్కొంది. తాను ఒంటరిగా ప్రయాణాలు చేస్తున్నా.. మానసికంగా ధృఢంగా మారడానికి అవసరమైన మార్గాలను అన్వేషించింది. మయోసైటిస్ కి చికిత్స తర్వాత ఇప్పటికి చాలా వరకూ దీని నుంచి బయటపడింది.
సమంత కెరీర్ మ్యాటర్‌కి వస్తే రాజ్ అండ్ డికె రూపొందిస్తున్న `రఖ్త్ బ్రహ్మండ్`లో నటిస్తోంది. ఇది సమంత నటజీవితంలో మరో వైవిధ్యమైన పాత్ర అని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సిరీస్ తో పాటు, తెలుగులో `మా ఇంటి బంగారం` అనే చిత్రాన్ని సొంత బ్యానర్ లో ప్రారంభించింది.