సమంత 'శుభం' టీజర్ టాక్: నవ్విస్తుందా? భయపెడుతుందా?
ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్‌కు భయాన్ని మిక్స్ చేసిన ఈ టీజర్‌లో నవ్వులతో పాటు ఓ రకమైన వైబ్ ని హైలెట్ చేస్తోంది.;

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఆమె స్థాపించిన ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘శుభం’ అనే కామెడీ హారర్ ఫిల్మ్ టీజర్ విడుదలై ఇప్పుడు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో, ఎంటర్‌టైన్‌మెంట్‌కు భయాన్ని మిక్స్ చేసిన ఈ టీజర్‌లో నవ్వులతో పాటు ఓ రకమైన వైబ్ ని హైలెట్ చేస్తోంది.
టీజర్ మొత్తం 90 సెకన్ల నిడివి ఉండగా, పల్లె వాతావరణం, ఇంట్లో ఉన్న భూతాన్ని చుట్టూ కథ తిరిగేలా చూపించారు. ముఖ్యంగా హీరోయిన్ తీరుని చూడగానే ఇది ఏ తరహా సినిమా అనే విషయం స్పష్టమవుతుంది. ఇందులో పాత్రల టైమింగ్, డైలాగ్స్ డెలివరీ, కామెడీ ట్రాక్స్ అన్నీ కూడా యూత్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని చెప్పొచ్చు.
హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం లాంటి కొత్త నటులతో రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రవీణ్ కండ్రెగుల డైరెక్ట్ చేస్తున్నారు. టీజర్ చూస్తుంటేనే కథా శైలిలో భిన్నత స్పష్టంగా తెలుస్తోంది. సమంత దగ్గర నుంచి వచ్చిన తొలి ప్రయత్నమే ఇంత ఫ్రెష్‌గా ఉండటం ప్రశంసించదగ్గ విషయం. అదే సమయంలో ఈ సినిమా కేవలం కామెడీ కాదు.. మంచి ఎమోషన్‌తో కూడిన కథనమని భావించే సన్నివేశాలు కూడా టీజర్‌లో ఉన్నాయన్న మాట.
వివేక్ సాగర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం టీజర్‌కు స్పెషల్ హైలైట్. సెకండ్స్ లోనే వాతావరణాన్ని సెటప్ చేసేలా స్కోర్‌ను ప్లాన్ చేశారు. అలాగే మృదుల్ సుజిత్ సేన్ సినిమాటోగ్రఫీ, ధర్మేంద్ర ఎడిటింగ్ కూడా విజువల్‌గా ఈ చిత్రాన్ని ఫ్రెష్‌గా చూపించాయి. టీజర్‌లోని చివరి 10 సెకన్లు ప్రత్యేకంగా హైలైట్ అయ్యేలా ఉన్నాయి.
మొత్తానికి ‘శుభం’ టీజర్ సమంత నిర్మాణ సంస్థకు మంచి ఆరంభం చెప్పవచ్చు. కామెడీ, హారర్, ఎమోషన్ మిక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం వేసవి సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. సమంత చెప్పినట్లుగానే.. ఇది ఓ చిన్న ప్రయత్నమే అయినా, ప్రేక్షకుల ప్రేమతో పెద్ద విజయమవుతుందా? అన్నది సమయం చెప్పాలి.