స‌మంత‌: మిలియ‌న్ సంవ‌త్స‌రాల్లో ఒక‌సారి

ఇలాంటిది కేవ‌లం 10ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల‌(మిలియ‌న్‌)కు ఒక‌సారి మాత్ర‌మే జ‌రుగుతుంద‌ని వ్యాఖ్యానించింది స‌మంత రూత్ ప్ర‌భు.

Update: 2024-09-30 04:46 GMT

ఇలాంటిది కేవ‌లం 10ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల‌(మిలియ‌న్‌)కు ఒక‌సారి మాత్ర‌మే జ‌రుగుతుంద‌ని వ్యాఖ్యానించింది స‌మంత రూత్ ప్ర‌భు. ఈ దృశ్యాన్ని తాను ఎప్పుడూ ఊహించ‌లేద‌ని కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. ఇంత‌కీ సామ్ అంత‌గా స్పందించ‌డానికి కార‌ణం ఏవ‌రు? అంటే.. ఎలాంటి సందేహం లేదు.. ది గ్రేట్ షారూఖ్ ఖాన్.

అబుదబీలో జ‌రిగిన మూడు రోజుల ఐఫా 2024 ఉత్స‌వాల్లో రెండో రోజు వేడుక‌ల్లో కింగ్ ఖాన్ షారూఖ్ స్టేజ్ ప్ర‌ద‌ర్శ‌న మైమ‌రిపించింది. అత‌డు త‌న‌దైన శైలి హాస్య చ‌తుర‌త‌తో హోస్టింగ్ చేయ‌డ‌మే గాక‌, పుష్ప‌లో ఊ అంటావా పాట‌కు విక్కీ కౌశ‌ల్ తో క‌లిసి డ్యాన్స్ చేసిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఒక రొమాంటిక్ పాట‌కు ఖాన్ ఇలా డ్యాన్స్ చేస్తాడ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.

అంద‌రిలాగే స‌మంత కూడా ఊహించ‌లేదు. స్ట‌న్ అయిపోయింది. దానికి స్పందిస్తూ ఇలాంటిది మిలియ‌న్ సంవత్స‌రాల‌కు ఒక‌సారి మాత్ర‌మే జరుగుతుంద‌ని ఆనందం వ్య‌క్తం చేసింది. కింగ్ ఖాన్ షారూఖ్ పై త‌న ప్రేమ‌ను అభిమానాన్ని సామ్ ఎంత‌మాత్రం దాచుకోలేక‌పోయింది. ఖాన్ పై ల‌వ్ ఈమోజీలతో ప్రేమ‌ను కురిపించింది.

సమంతా రూత్ ప్రభు సోషల్ మీడియాలో షారూఖ్ క్లిప్‌ను షేర్ చేసి ఇలా త‌న ఆనందాన్ని వ్య‌క్తంచేసారు. ``మిలియన్ సంవత్సరాలలో ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు!`` అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. స్మైల్, ల‌వ్ ఈమోజీల‌ను షేర్ చేసింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ ప్ర‌య‌త్నాల్లో ఉన్న స‌మంత‌కు త‌దుప‌రి షారూఖ్ లాంటి పెద్ద హీరోతో ఆఫ‌ర్ ఉంటుందేమో చూడాలి. స‌మంత త‌న సొంత ప్రొడ‌క్ష‌న్ లో బంగారం అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీమ్యాన్ మేక‌ర్స్ రాజ్ అండ్ డీకే నిర్మాణంలోని ర‌క్త్ భ్ర‌హ్మాండ్ సిరీస్ లోను న‌టిస్తోంది. అలాగే సిటాడెల్- హ‌నీ బ‌న్నీ ఓటీటీలో అక్టోబ‌ర్ 10 నుంచి స్ట్రీమింగుకి వ‌స్తోంది.

Tags:    

Similar News