డైరెక్టర్స్‌ని అంతగా వేడుకున్న సమంత
సిటాడెల్ `హనీ బన్నీ`లో నటించింది సమంత రూత్ ప్రభు. వరుణ్ ధావన్ సహనటుడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.
సిటాడెల్ `హనీ బన్నీ`లో నటించింది సమంత రూత్ ప్రభు. వరుణ్ ధావన్ సహనటుడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో సమంత నట ప్రదర్శన ఆద్యంతం మంత్ర ముగ్ధం చేసింది. ఓవైపు మయోసైటిస్ లాంటి ప్రమాదకర రుగ్మతతో బాధపడుతున్నా, మరోవైపు సమంత గట్సీ యాక్షన్ సీక్వెన్సుల్లో నటించడం ఆశ్చర్యపరిచింది. కండరాలను ప్రభావితం చేసే స్వయం ప్రతిరక్షక రుగ్మత అయిన మైయోసిటిస్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ఈ కఠోర శిక్షణ సాగింది. కానీ తన వ్యక్తిగత సమస్యను తెరపై కనిపించకుండా మ్యానేజ్ చేసేందుకు సమంత చేసిన పోరాటం స్ఫూర్తి నింపుతోంది.
ఇటీవల `గలాట్టా ఇండియా`తో ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. తన ఆరోగ్య సమస్యల కారణంగా షోనుంచి వైదొలగుతానని, తన స్థానాన్ని ఎవరితో అయినా భర్తీ చేయమని దర్శకులు రాజ్ అండ్ డికెని వేడుకున్నట్లు వెల్లడించింది. ``నేను వారిని ముందుకు సాగమని వేడుకున్నాను.. ఎందుకంటే నేను దీన్ని చేయగలనని నిజంగా అనుకోలేదు. చేయలేనని నాకు కచ్చితంగా తెలుసు`` అని సామ్ ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు.. తాను చేయాల్సిన పాత్రకు ఏ నటి సరిపోతుందో కూడా తానే జాబితాను రూపొందించి వారికి చూపించిందట. ``ఈ హీరోయిన్‌ని చూడండి... చాలా అద్భుతంగా ఉంది. ఈ పాత్రలో చంపుతుంది. నేను దీన్ని చేయలేను! అని వేడుకుంటూ వారికి నాలుగు ఆప్షన్లు పంపాను. అప్పటికి నేను నిజంగా బాగా లేను`` అని తెలిపింది.
అయినా దర్శకులు మారలేదు. సందేహాలు ఉన్నప్పటికీ సమంతతోనే ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. చివరికి సమంత ఛాలెంజ్‌లో నెగ్గేందుకు బలాన్ని పొందింది. తుది ఉత్పత్తిని చూసిన తర్వాత సామ్ తన దర్శకులకు అపారమైన కృతజ్ఞతలను వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ ప్రదర్శనను చూస్తున్నప్పుడు నేను లేకుండా వారు దీన్ని చేయలేకపోయినందుకు, అవసరమైన శక్తిని కనుగొన్నందుకు చాలా కృతజ్ఞురాలిని. ఈ షోపై తీర్పు వెలువడకముందే నేను చాలా నమ్మకంగా ఉన్నాను``అని తెలిపింది.
సిటాడెల్ `హనీ బన్నీ` ట్రైలర్ లాంచ్ సందర్భంగా సహనటుడు వరుణ్ ధావన్ సమంత మొండితనాన్ని ప్రశంసించారు. చిత్రీకరణ ప్రక్రియ అంతటా ధృఢనిశ్చయంతో తన పనిని తాను చేసిందని తెలిపారు. తాను ఎంత పెద్ద ఇబ్బందిలో ఉన్నా కానీ, సంకల్పంతో ఈ పనిని పూర్తి చేసిందని అతడు పొగిడేశాడు. ``సిటాడెల్: హనీ బన్నీ`` అనేది ప్రియాంక చోప్రా -రిచర్డ్ మాడెన్ నటించిన అమెరికన్ స్పై-యాక్షన్ సిరీస్ `సిటాడెల్` స్పిన్-ఆఫ్. ఈ యాక్షన్ డ్రామా నవంబర్ 7 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.