సమంత థౌసండ్ వాట్స్ ఎనర్జీ..!

ఐతే ఒకసారి ఫాం కోల్పోయాక మళ్లీ దాన్ని ట్రాక్ ఎక్కించడం అనేది చాలా కష్టం. కానీ సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు మాత్రం అది చాలా తేలికైన పద్ధతిగా ఉంది

Update: 2024-10-17 13:30 GMT

సౌత్ స్టార్ హీరోయిన్ గా అందరు క్రేజ్ తెచ్చుకుంటారు. కొద్దిగా టాలెంట్ ఉండి.. వచ్చిన ఆఫర్లను వాడుకుంటే చాలు ఇప్పుడున్న టైం లో స్టార్ క్రేజ్ మరీ అంత కష్టం కాదు కానీ అలా వచ్చిన ఇమేజ్ ని కాపాడుకోవడం మాత్రం కత్తి మీద సాము లాంటిది. ఐతే ఒకసారి ఫాం కోల్పోయాక మళ్లీ దాన్ని ట్రాక్ ఎక్కించడం అనేది చాలా కష్టం. కానీ సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు మాత్రం అది చాలా తేలికైన పద్ధతిగా ఉంది.

ఏ హీరోయిన్ ఫేస్ చేయలేని పరిస్థితులు సమంత జీవితంలో జరిగాయి. పరిస్థితులు తనని ఎంత వెనకపడేలా చేసినా తన నటనతో సమంత మళ్లీ మళ్లీ తన టాలెంట్ చూపిస్తుంది. దాదాపు ఇక ఆమె పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి డబుల్ ఎనర్జీతో సర్ ప్రైజ్ చేస్తూనే వచ్చింది. సౌత్ లో స్టార్ హీరోయి గా టాప్ రేంజ్ కి వెళ్లిన సమంత పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని ఇబ్బందుల వల్ల సినిమాలకు దూరమైంది. ఐతే ఇప్పుడు అమ్మడు తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. అందులో కూడా అదరగొట్టేస్తుంది. హెల్త్ ఇష్యూస్ వల్ల కొద్దిగా గ్యాప్ ఇచ్చిన సమంత.. టైం గ్యాప్ అంతే టైమింగ్ లో తేడా లేదన్న రేంజ్ లో దూసుకెళ్తుంది.

ఈసారి కేవలం సౌత్ సినిమాలే కాకుండా బాలీవుడ్ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది అమ్మడు. ఆల్రెడీ అక్కడ ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ లతో బీ టౌన్ ఆడియన్స్ ని మెప్పించిన సమంత ఇప్పుడు సిటాడెల్ సీరీస్ తో కూడా అలరించాలని ఫిక్స్ అయ్యింది. లేటెస్ట్ గా రిలీజైన సిటాడెల్ హనీ బనీ ట్రైలర్ లో కూడా సమంత థౌసండ్ వాట్స్ ఎనర్జీతో అదరగొట్టేసింది. తన కోసం రాసిన ప్రతి పాత్రకు ఆమె 100 పర్సెంట్ ఇచ్చేందుకు సిద్ధం అనేలా సమంత సత్తా చాటుతుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం నిర్మాతగా మారి మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది. ఈ సినిమా విషయంలో అంతా సీక్రెట్ గా కానిచ్చేస్తుంది సమంత. ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న మా ఇంటి బంగారం తో సడెన్ సర్ ప్రైజ్ ఇవ్వాలనే గట్టి ప్లానింగ్ తో ఉంది సమంత. సో ఇప్పటికైనా సమంత కెరీర్ కి బ్రేకులు లేకుండా చేయాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.



Tags:    

Similar News