సామ్ ఆకాశం ఎత్తు.. ఎన్ని విసిగించినా వేధించినా..
ఒకటే జననం.. ఒకటే మరణం.. గెలుపు అందేవరకూ.. అలుపు అన్నదే లేదు! అన్న చందంగా సమంత పోరాటం అందరిలో స్ఫూర్తి నింపుతోంది
ఒకటే జననం.. ఒకటే మరణం.. గెలుపు అందేవరకూ.. అలుపు అన్నదే లేదు! అన్న చందంగా సమంత పోరాటం అందరిలో స్ఫూర్తి నింపుతోంది. వరుసగా ఊహించని ప్రమాదాలు ఎన్ని మీద పడినా అన్నిటినీ తట్టుకుని నిలబడింది సమంత రూత్ ప్రభు. అనారోగ్యం.. వ్యక్తిగత జీవితంలో సమస్య.. ఒకేసారి తనను వెంటాడాయి. అయినా కెరీర్ ని విడిచి పెట్టలేదు. జిమ్ లో కసరత్తులను కూడా ఆపలేదు.
ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సిరీస్ కోసం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంది. మరోవైపు సొంత బ్యానర్ లో బంగారం అనే సినిమాని ప్రారంభించింది. అయితే ఇంతలోనే సమంత చికెన్ గున్యా లాంటి అత్యంత ఇబ్బందికరమైన జ్వరంతో బాధపడింది. కీళ్లనొప్పులను భరించింది.
సమస్యలు ఎదురైనా.. ఇవేవీ పట్టనట్టు సమంత తాను అందనంత ఎత్తులో ఉన్నానని ప్రకటించింది. అది కూడా ఒక ఫోటో రూపంలో. సామ్ షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ లో సమంతా రూత్ ప్రభు పొడవైన భవనం పక్కన నిలబడి పొడవైన ఓవర్ కోట్ - వులెన్ టోపీతో కనిపించింది. లాంగ్ కోట్ పూర్తిగా చలిని తట్టుకునేదిగా కనిపిస్తోంది. జనవరి మూడ్ అనే మరో ఫోటోగ్రాఫ్ ని కూడా షేర్ చేసింది. ఇవన్నీ అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.
ఓవైపు చికెన్ గున్యా వేధించినా తగ్గేదేలే అంటూ ఫిట్ నెస్ కోసం సమంత తపిస్తున్న తీరు ఆసక్తిని కలిగిస్తోంది. తన ఫిట్‌నెస్ లక్ష్యాల విషయంలో రాజీ అన్నదే లేదని సామ్ నిరూపిస్తోంది. జిమ్ నుంచి సామ్ ఫోటోలను షేర్ చేయగా, ఇంటర్నెట్ లో అవన్నీ వైరల్ అవుతున్నాయి. ``చికున్‌గున్యా నుండి కోలుకోవడం చాలా సరదాగా ఉంటుంది. కీళ్ల నొప్పులు అన్నీ బావున్నాయ్`` అని సమంత సరదాగా వ్యాఖ్యానించింది. రెండేళ్లుగా మయోసైటిస్ ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు చికెన్ గున్యా వేధించినా అన్నిటినీ సమంత చాలా నొప్పిని భరించింది. అన్నిటినీ తట్టుకుని నిలబడింది. ఇక సమంతకు 2025లో ఎదురే లేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.